క్వారంటైన్‌లోకి వెళ్లిన టీమ్ ఇండియా

దిశ, స్పోర్ట్స్: శ్రీలంక పర్యటనకు వెళ్లిన టీమ్ ఇండియా మరో రెండు రోజుల్లో తొలి వన్డే ఆడాల్సి ఉండగా కరోనా కలకలం రేపిన సంగతి తెలిసిందే. శ్రీలంక జట్టులోని బ్యాటింగ్ కోచ్ గ్రాంట్ ఫ్లవర్, డేటా అనలిస్ట్ నిరోషన్ కరోనా బారిన పడటంతో జట్టు మొత్తం క్వారంటైన్‌లో ఉన్నది. దీంతో వన్డే, టీ20 మ్యాచ్‌లను రీషెడ్యూల్ చేశారు. కొత్త షెడ్యూల్ ప్రకారం 17న తొలి వన్డే జరుగనున్నది. దీంతో ప్రాక్టీస్ చేస్తున్న టీమ్ ఇండియాను కూడా తిరిగి […]

Update: 2021-07-10 07:33 GMT

దిశ, స్పోర్ట్స్: శ్రీలంక పర్యటనకు వెళ్లిన టీమ్ ఇండియా మరో రెండు రోజుల్లో తొలి వన్డే ఆడాల్సి ఉండగా కరోనా కలకలం రేపిన సంగతి తెలిసిందే. శ్రీలంక జట్టులోని బ్యాటింగ్ కోచ్ గ్రాంట్ ఫ్లవర్, డేటా అనలిస్ట్ నిరోషన్ కరోనా బారిన పడటంతో జట్టు మొత్తం క్వారంటైన్‌లో ఉన్నది. దీంతో వన్డే, టీ20 మ్యాచ్‌లను రీషెడ్యూల్ చేశారు. కొత్త షెడ్యూల్ ప్రకారం 17న తొలి వన్డే జరుగనున్నది. దీంతో ప్రాక్టీస్ చేస్తున్న టీమ్ ఇండియాను కూడా తిరిగి క్వారంటైన్‌కు తరలించారు. శిఖర్ ధావన్ నేతృత్వంలోని భారత పరిమిత ఓవర్ల క్రికెట్ జట్టు కొలంబోలోని హోటల్ రూమ్‌లకు చేరుకొని అక్కడే క్వారంటైన్అయ్యారు. షెడ్యూల్ ప్రకారం మరో ఇంట్రాస్క్వాడ్ మ్యాచ్ జరగాల్సి ఉండగా దాన్ని రద్దు చేసి క్వారంటైన్‌లోకి వెళ్లినట్లు సమాచారం. కాగా, వన్డే సిరీస్ ముందు మరో ఇంట్రాస్క్వాడ్ మ్యాచ్ ఆడతారా, నేరుగా మ్యాచ్ ఆడతారా అనే దానిపై బీసీసీఐ క్లారిటీ ఇవ్వాల్సి ఉన్నది.

బి టీమ్‌తో బరిలోకి దిగనున్న శ్రీలంక?

శ్రీలంక జట్టు ఇంగ్లాండ్ పర్యటనకు వెళ్లిన సమయంలోనే పలువురు క్రికెటర్లు కరోనా బారిన పడ్డారు. అక్కడి నుంచి వచ్చిన తర్వాత అందరినీ క్వారంటైన్ చేశారు. కానీ కోచ్, డేటా అనలిస్ట్ కరోనా సోకడంతో ఏకంగా షెడ్యూల్ మార్చాల్సి వచ్చింది. అయితే ఆ తర్వాత కరోనా కేసులు బయటపడితే మాత్రం శ్రీలంక ‘బి’ జట్టును ఆడించాలని ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ సిరీస్ ద్వారా శ్రీలంక బోర్డు తమ నష్టాలను పూడ్చుకోవాలని చూస్తున్నది. ఇప్పటికే సిరీస్ కోసం భారీగా పెట్టుబడి పెట్టింది. ఈ సమయంలో కనుక సిరీస్ రద్దయితే అది మరింత భారంగా మారే అవకాశం ఉన్నది. అందుకే మరో కొత్త జట్టుతో భారత్ సిరీస్‌ను కొనసాగించాలని శ్రీలంక బోర్డు ఆలోచిస్తున్నట్లు అధికారి ఒకరు మీడియాకు తెలిపారు. అయితే ఒకటి రెండు రోజుల్లో దీనిపై క్లారిటీ వచ్చే అవకాశం ఉన్నది.

Tags:    

Similar News