ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటే కస్టోడియల్ డెత్ చేయడమా ?
దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో ఫ్రెండ్లీ పోలీసింగ్‌పై కాంగ్రెస్ ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్‌బాబు తీవ్రంగా స్పందించారు. ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటే కస్టోడియల్ డెత్ చేయడమా అని మండిపడ్డారు. మంగళవారం ఆయన గాంధీ భవన్‌లో మీడియాతో మాట్లాడుతూ వన్యప్రాణుల కేసులో పీడియాక్ట్ కేసు పెడతామని బెదిరించడంతోనే శీలం రంగయ్య అనే వ్యక్తి మంథని పోలీస్‌స్టేషన్‌లో సూసైడ్ చేసుకున్నాడని ఆరోపణలు చేశారు. రంగయ్యను 24వ తేదీన రిమాండ్ చేస్తే పోలీస్‌స్టేషన్‌లో ఎలా ఆత్మహత్య చేసుకున్నాడని ఆయన ప్రశ్నించారు. రంగయ్య సూసైడ్ కేసులో […]
దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో ఫ్రెండ్లీ పోలీసింగ్‌పై కాంగ్రెస్ ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్‌బాబు తీవ్రంగా స్పందించారు. ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటే కస్టోడియల్ డెత్ చేయడమా అని మండిపడ్డారు. మంగళవారం ఆయన గాంధీ భవన్‌లో మీడియాతో మాట్లాడుతూ వన్యప్రాణుల కేసులో పీడియాక్ట్ కేసు పెడతామని బెదిరించడంతోనే శీలం రంగయ్య అనే వ్యక్తి మంథని పోలీస్‌స్టేషన్‌లో సూసైడ్ చేసుకున్నాడని ఆరోపణలు చేశారు. రంగయ్యను 24వ తేదీన రిమాండ్ చేస్తే పోలీస్‌స్టేషన్‌లో ఎలా ఆత్మహత్య చేసుకున్నాడని ఆయన ప్రశ్నించారు. రంగయ్య సూసైడ్ కేసులో పోలీసు తీరుపై అనుమానాలు ఉన్నాయని, దీనిపై జ్యుడీషియల్ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 10 నుంచి 15 కస్టోడియల్ డెత్స్ నమోదు అయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. తప్పు చేస్తే చట్టపరమైన చర్య తీసుకుంటే తప్పులేదు కానీ, ఓ దళిత వ్యక్తిపై పోలీసుల జులుం చూపించడం కరెక్ట్ కాదని వ్యాఖ్యానించారు. కేసులో అనుమానాలు ఉంటే నివృత్తి చేయాల్సిన బాధ్యత పోలీస్ శాఖ, డీజీపీపై ఉందని, కానీ రంగయ్య ఫ్యామిలీ మెంబర్స్ కాంప్రమైజ్ కావాలని డీజీపీ ఇద్దరు స్పెషల్ ఆఫీసర్స్‌ను నియమించడం ఏంటని శ్రీధర్ బాబు ప్రశ్నించారు. ఘటనపై హోంమంత్రి, డీజీపీ స్పందించాలని, రంగయ్య కుటుంబానికి ప్రభుత్వం రూ.25లక్షల పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు.