నటిపై కెమెరామెన్ మర్డర్ అటెంప్ట్?
దిశ, సినిమా: కెమెరామెన్ శ్యామ్ కె. నాయుడుపై మరోసారి కేసు పెట్టింది నటి శ్రీసుధ. పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడంటూ గతంలో హైదరాబాద్ ఎస్ఆర్ నగర్ పీఎస్‌లో కేసు పెట్టిన ఆమె.. తాజాగా విజయవాడ వన్ టౌన్ పోలీసులను ఆశ్రయించింది. శ్యామ్ కె.నాయుడు తను ప్రయాణిస్తున్న కారును ఢీకొట్టి చంపేయాలనుకున్నారని ఫిర్యాదులో పేర్కొంది. కనకదుర్గ ఫ్లైఓవర్‌పై ప్రయాణిస్తున్న తనపై మర్డర్ అటెంప్ట్ జరిగిందని ఆరోపించింది. ఇంతకుముందు పోలీసులను ఆశ్రయించినందుకే తనను మర్డర్ చేయాలనుకున్నారని, ఆయనపై చర్యలు […]
దిశ, సినిమా: కెమెరామెన్ శ్యామ్ కె. నాయుడుపై మరోసారి కేసు పెట్టింది నటి శ్రీసుధ. పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడంటూ గతంలో హైదరాబాద్ ఎస్ఆర్ నగర్ పీఎస్‌లో కేసు పెట్టిన ఆమె.. తాజాగా విజయవాడ వన్ టౌన్ పోలీసులను ఆశ్రయించింది. శ్యామ్ కె.నాయుడు తను ప్రయాణిస్తున్న కారును ఢీకొట్టి చంపేయాలనుకున్నారని ఫిర్యాదులో పేర్కొంది. కనకదుర్గ ఫ్లైఓవర్‌పై ప్రయాణిస్తున్న తనపై మర్డర్ అటెంప్ట్ జరిగిందని ఆరోపించింది. ఇంతకుముందు పోలీసులను ఆశ్రయించినందుకే తనను మర్డర్ చేయాలనుకున్నారని, ఆయనపై చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరింది.