వాహనం ఆపడంతో కంట్రోల్ తప్పిన ఓనర్!
దిశ, వెబ్‌డెస్క్ : ఔటర్ రింగ్ రోడ్డు వద్ద వాహనాలు తనిఖీ చేస్తున్న ట్రాఫిక్ పోలీసులపై ఓ వ్యక్తి దాడికి పాల్పడ్డాడు. రోజువారీ విధుల్లో భాగంగా ట్రాఫిక్ పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు చేస్తున్నారు. ఆ సమయంలో అటుగా వెళ్తున్న వాహనాన్ని ఆపేందుకు ప్రయత్నించారు. వాహనం దిగిన వ్యక్తి పోలీసులతో వాగ్వివాదానికి దిగాడు. అతన్ని కంట్రోల్ చేసేందుకు ప్రయత్నించిన ట్రాఫిక్ పోలీసులపై చేయి చేసుకున్నాడు. ఆ సమయంలో అతను మద్యం సేవించి ఉన్నట్లు సమాచారం. నిందితుడిని […]
దిశ, వెబ్‌డెస్క్ : ఔటర్ రింగ్ రోడ్డు వద్ద వాహనాలు తనిఖీ చేస్తున్న ట్రాఫిక్ పోలీసులపై ఓ వ్యక్తి దాడికి పాల్పడ్డాడు. రోజువారీ విధుల్లో భాగంగా ట్రాఫిక్ పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు చేస్తున్నారు. ఆ సమయంలో అటుగా వెళ్తున్న వాహనాన్ని ఆపేందుకు ప్రయత్నించారు. వాహనం దిగిన వ్యక్తి పోలీసులతో వాగ్వివాదానికి దిగాడు. అతన్ని కంట్రోల్ చేసేందుకు ప్రయత్నించిన ట్రాఫిక్ పోలీసులపై చేయి చేసుకున్నాడు.
ఆ సమయంలో అతను మద్యం సేవించి ఉన్నట్లు సమాచారం. నిందితుడిని శ్రీరాములుగా గుర్తించారు. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా శంషాబాద్ ఓఆర్ ఆర్ వద్ద ఆదివారం సాయంత్రం వెలుగులోకి వచ్చింది. దీంతో శ్రీరాములును అదుపులోకి తీసుకున్నారు. అనంతరం, అతనికి చెందిన టాటా సుమో కారును సీజ్ చేసినట్లు పోలీసులు తెలిపారు.