ప్రస్తుత వేరియంట్లన్నింటికీ స్పుత్నిక్ వీ చెక్

న్యూఢిల్లీ: ఇప్పటి వరకు వెలుగులోకి వచ్చిన కరోనా వైరస్ వేరియంట్లన్నింటికీ స్పుత్నిక్ వీ టీకా చెక్ పెడుతుందని రష్యా ప్రకటించింది. యూకేలో తొలి కేసు నమోదైన ఆల్ఫా వేరియంట్, ఇండియాలో కనిపించిన డెల్టా వేరియంట్‌నైనా స్పుత్నిక్ వీ అడ్డుకుంటుందని ఈ టీకాను అభివృద్ధి చేసిన గమలేయా రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎపిడమాలజీ అండ్ మైక్రోబయోలజీ హెడ్ అలెగ్జాండర్ గింట్స్‌బర్గ్‌ వెల్లడించారు. కొవిషీల్డ్, కొవాగ్జిన్ తర్వాత ఇండియాలో అత్యవసర వినియోగ అనుమతి పొందిన టీకా స్పుత్నిక్ వీ. ఇది […]

Update: 2021-06-22 08:41 GMT

న్యూఢిల్లీ: ఇప్పటి వరకు వెలుగులోకి వచ్చిన కరోనా వైరస్ వేరియంట్లన్నింటికీ స్పుత్నిక్ వీ టీకా చెక్ పెడుతుందని రష్యా ప్రకటించింది. యూకేలో తొలి కేసు నమోదైన ఆల్ఫా వేరియంట్, ఇండియాలో కనిపించిన డెల్టా వేరియంట్‌నైనా స్పుత్నిక్ వీ అడ్డుకుంటుందని ఈ టీకాను అభివృద్ధి చేసిన గమలేయా రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎపిడమాలజీ అండ్ మైక్రోబయోలజీ హెడ్ అలెగ్జాండర్ గింట్స్‌బర్గ్‌ వెల్లడించారు.

కొవిషీల్డ్, కొవాగ్జిన్ తర్వాత ఇండియాలో అత్యవసర వినియోగ అనుమతి పొందిన టీకా స్పుత్నిక్ వీ. ఇది కొన్ని ఎంపిక చేసుకున్న ప్రైవేటు హాస్పిటళ్లలో రూ. 1145లకు ఒక డోసు లభిస్తున్నది. ఇతర టీకాలన్నింటికంటే స్పుత్నిక్ వీ టీకానే వేరియంట్లను సమర్థంగా ఎందుర్కొంటున్నదని గమలేయ సెంటర్ స్టడీని ఉటంకిస్తూ ఆర్‌డీఐఎఫ్ ఈ నెలలోనే పేర్కొంది. డెల్టా వేరియంట్‌ను ఎదుర్కోవడానికి ఇతర టీకాలకు బూస్టర్ షాట్‌గా స్పు్త్నిక్ వీ టీకాను అందించడానికి సిద్ధమని వెల్లడించింది.

Tags:    

Similar News