'అలా చేస్తే కరోనా కంటే మనిషికే డేంజర్'
కరోనా వైరస్ కట్టడి చేసే చర్యల్లో భాగంగా ప్రపంచవ్యాప్తంగా చాలా చోట్ల జనావాసాల్లో క్రిమిసంహారక మందులను పిచికారీ చేస్తున్నారు. ఇలా చేయడం వల్ల వైరస్ చనిపోవడం కంటే మనుషులకే ఎక్కువ ప్రమాదమని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించింది. వైరస్ నిర్మూలన చర్యల్లో భాగంగా బహిరంగ ప్రదేశాల్లో, జనాల రద్దీ ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో కొన్ని రకాల క్రిమి సంహారకాలను పిచికారి చేస్తున్నారు. ఈ మందుల నుంచి వెలువడే ఘాటైన వాసనలు, తుంపర్ల వల్ల మనుషులకు ప్రమాదం అని […]
కరోనా వైరస్ కట్టడి చేసే చర్యల్లో భాగంగా ప్రపంచవ్యాప్తంగా చాలా చోట్ల జనావాసాల్లో క్రిమిసంహారక మందులను పిచికారీ చేస్తున్నారు. ఇలా చేయడం వల్ల వైరస్ చనిపోవడం కంటే మనుషులకే ఎక్కువ ప్రమాదమని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించింది. వైరస్ నిర్మూలన చర్యల్లో భాగంగా బహిరంగ ప్రదేశాల్లో, జనాల రద్దీ ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో కొన్ని రకాల క్రిమి సంహారకాలను పిచికారి చేస్తున్నారు. ఈ మందుల నుంచి వెలువడే ఘాటైన వాసనలు, తుంపర్ల వల్ల మనుషులకు ప్రమాదం అని చెప్పింది. కొన్ని దేశాల్లో అయితే డిస్‌ఇన్‌ఫెక్ట్ పేరుతో మనుషులపై కూడా నేరుగా చల్లుతున్నారు. ఇలాంటి విధానాల వల్ల కండ్లకు నేరుగా ప్రమాదం కలుగుతుంది. దీర్ఘకాలంలో శ్వాసకోస, చర్మ సంబంధిత వ్యాధులు వచ్చే అవకాశం ఉందని డబ్ల్యూహెచ్‌వో పేర్కొంది. చాలా ప్రాంతాల్లో ఫార్మాల్డిహైడ్, క్లోరిన్ వంటి రసాయనాలు చల్లుతున్నారని.. ఇవి చాలా ప్రమాదకరమైనవని చెప్పింది. అసలు ఈ రసాయనాలు ఎక్కడ పిచికారి చేసినా ప్రయోజనం ఉండదని.. దీనివల్ల అనవసరపు ఖర్చేనని డబ్ల్యూహెచ్‌లో స్పష్టం చేసింది. వెంటనే ఇలాంటి చర్యలను ఆపేయాలని ప్రపంచ దేశాలను ఆదేశించింది.