చెలరేగిన భారత యువ బౌలర్లు.. టీమ్ ఇండియా ముందు స్వల్ప టార్గెట్

టీ20 ప్రపంచ కప్ తర్వాత భారత యువ ప్లేయర్లు జింబాబ్వే టూర్‌కు వెళ్లారు. ఇందులో ఐదు టీ20 సిరీస్‌లలో భాగంగా ఈ రోజు మొదటి టీ20లో జరుగుతుంది.

Update: 2024-07-06 12:47 GMT

దిశ, వెబ్ డెస్క్: టీ20 ప్రపంచ కప్ తర్వాత భారత యువ ప్లేయర్లు జింబాబ్వే టూర్‌కు వెళ్లారు. ఇందులో ఐదు టీ20 సిరీస్‌లలో భాగంగా ఈ రోజు మొదటి టీ20లో జరుగుతుంది. ఇందులో టాస్ గెలిచిన భారత్ బౌలింగ్ ఎంచుకోవడంతో జింబాబ్వే జట్టు మొదట బ్యాటింగ్ చేసింది. కాగా మొదటి 8 ఓవర్ల వరకు నిలకడగా రాణించిన జింబాబ్వే బ్యాటర్లు, ఆ తర్వాత భారత యువ బౌలర్ల ధాటికి కుప్పకూలిపోయారు. వచ్చినవారు వచ్చినట్లే అవుట్ కావడంతో.. జింబాబ్వే జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 115 పరుగులు చేసింది. ఈ మ్యాచుల్లో భారత బౌలర్లు రవి బిష్ణోయ్ 4, వాషింగ్టన్ సుందర్ 2, అవేశ్ ఖాన్1, ముఖేష్ కుమార్ 1 వికెట్ తీసుకున్నారు. కాగా ఈ మ్యాచులో భారత్ విజయం సాధించాలంటే నిర్ణీత 20 ఓవర్లలో 116 పరుగులు చేయాల్సి ఉంది.


Similar News