Virat Kohli : కోహ్లీకి ఆ టాపిక్ అంటే చాలా ఆసక్తి.. దినేశ్ కార్తీక్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

టీమ్ ఇండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీకి సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ విషయాన్ని భారత మాజీ క్రికెటర్ దినేశ్ కార్తీక్ రివీల్ చేశాడు.

Update: 2024-07-20 14:20 GMT

దిశ, స్పోర్ట్స్ : టీమ్ ఇండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీకి సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ విషయాన్ని భారత మాజీ క్రికెటర్ దినేశ్ కార్తీక్ రివీల్ చేశాడు. గ్రహాంతరవాసుల గురించి తెలుసుకోవడానికి విరాట్ ఆసక్తి కనబరుస్తాడని చెప్పాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన దినేశ్ కార్తీక్‌కు ఏలియన్స్ గురించి అడిగారు. దానికి ఏలియన్స్‌ను తాను నమ్మనని, దాని గురించి తనకు పెద్దగా అవగాహన లేదన్నాడు.

‘ఏలియన్స్‌ను నేను నమ్మను. కానీ, ఒక్కరికి బాగా ఆసక్తి. అతను ఎవరో తెలిస్తే కచ్చితంగా ఆశ్చర్యపోతారు. అతను మరెవరో కాదు విరాట్ కోహ్లీ. ఒకసారి ఏలియన్స్‌కు సంబంధించిన యూట్యూబ్ వీడియోను కోహ్లీ నాకు చూపించాడు. అమెరికాలో లేదా నెవాడాలో ఏదో ఒక ప్రాంతంలో గ్రహాంతరవాసులు కనిపించారని చెప్పాడు. ఏలియన్స్ గురించి పెద్దగా పట్టించుకోను. కాబట్టి, ఆ ప్రాంతం పేరు మర్చిపోయాను. కానీ, కోహ్లీకి ఆ విషయంపై చాలా ఆసక్తి ఉంది’ అని చెప్పుకొచ్చాడు. కాగా, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు తరపున కోహ్లీ, దినేశ్ కార్తీక్ చాలా ఏళ్లు ఆడాడు. ఈ సీజన్‌తో దినేశ్ కార్తీక్ ఐపీఎల్‌తోపాటు అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే. వచ్చే సీజన్‌లో బెంగళూరు జట్టుకు అతను మెంటార్, బ్యాటింగ్ కోచ్‌గా వ్యవహరించనున్నాడు.

Tags:    

Similar News