సచిన్‌తో కోహ్లీకి పోలికా.. గంభీర్ షాకింగ్ కామెంట్స్

శ్రీలంకతో జరిగిన తొలి వన్డే మ్యాచ్‌లో భాగంగా విరాట్ కోహ్లీ సెంచరీతో చెలరేగిన విషయం తెలిసిందే.

Update: 2023-01-11 10:28 GMT

దిశ, వెబ్‌డెస్క్: శ్రీలంకతో జరిగిన తొలి వన్డే మ్యాచ్‌లో భాగంగా విరాట్ కోహ్లీ సెంచరీతో చెలరేగిన విషయం తెలిసిందే. 87 బంతుల్లో 12 ఫోర్లు 1 సిక్సర్ సాయంతో 113 పరుగులు సాధించాడు. ఈ నేపథ్యంలో విరాట్ కోహ్లీని లెజెండ్ సచిన్ టెండూల్కర్‌తో పోలుస్తూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. అయితే దీనిపై మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. సచిన్‌తో విరాట్ కోహ్లీని పోల్చడం సరికాదని అభిప్రాయం వ్యక్తం చేశాడు.

గంభీర్ కోహ్లీ సెంచరీలపై మాట్లాడుతూ.. కోహ్లీని సచిన్‌తో పోల్చడం సరికాదని.. సచిన్ క్రికెట్ ఆడే కాలంలో ఫీల్డ్ ఆంక్షలు చాలా కఠినంగా ఉండేవి. ఫీల్డ్‌లో 36 గజాల సర్కిల్ వెలుపల ఐదు మంది కంటే ఎక్కువ ప్లేయర్స్ ఉండేవారు. దీంతో బౌండరీలు కొట్టడం అంత ఈజీగా ఉండేది కాదు అని అన్నారు. అంటే ఇప్పుడు రూల్స్ బ్యాట్స్ మెన్‌కు అనుకూలంగా ఉన్నాయని.. కాబట్టే కోహ్లీ ఈజీగా రన్స్ చేస్తున్నారని గంభీర్ అభిప్రాయపడ్డాడు. అయితే గంభీర్ స్పందించిన తీరుపై కోహ్లీ ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు.

Tags:    

Similar News