WWE Superstar Spectacle: హైదరాబాద్ వేదికగా తొలిసారి WWE ఫైట్..

Update: 2023-09-08 13:01 GMT

దిశ, వెబ్‌డెస్క్: ప్రపంచ వ్యాప్తంగా ఎంతో ప్రాధాన్యత ఉన్న WWE పోటీలు మొదటిసారి హైదరాబాద్‌‌ల జరగనున్నాయి. మొదటి సారి భారత్‌లో 2016 లో WWE పోటీలు జరగగా.. తిరిగి 7 సంవత్సరాల తర్వాత హైదరాబాద్‌లో ఈ పోటీలు జరుగుతున్నాయి. హైదరాబాద్‌లోని గచ్చిబౌలి స్టేడియంలో ఈ రోజు రాత్రి జరగబోయే WWE మ్యాచ్ చూసేందుకు అభిమానులు భారీగా తరలివస్తున్నారు. తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా అభిమానులు స్టేడియానికి చేరుకుంటున్నారు. ఈ మ్యాచ్‌లో తమ అభిమాన ఫైటర్లను దగ్గరగా చూసే అవకాశం కలుగుతుందని సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు పోలీసులు స్టేడియం వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ మ్యాచ్ రాత్రి 7.30కు మ్యాచ్ గంటలకు ప్రారంభం అవుతుంది.

హైదరాబాద్ వేదికగా మొట్టమొదటి సారిగా WWE ఫైట్ జరగనుంది. WWE సూపర్ స్టార్ స్పెక్టాకిల్ పేరుతో ఈవెంట్ నిర్వహించనున్నారు. ఈ సూపర్ ఫైట్లో 28 మంది అంతర్జాతీయ చాంపియన్స్ పోటీ పడనున్నారు. ప్రత్యేక ఆకర్షణ గా WWE లెజెండ్ జాన్ సేనా నిలవనున్నారు. 17 ఏళ్ల తర్వాత ఇండియా కి వచ్చిన జాన్ సేవా.. ఇండియా కి రావడం సంతోషంగా ఉందన్నారు.

ప్రపంచ హెవీవెయిట్ ఛాంపియన్ సేథ్ ఫ్రీకిన్ రోలిన్స్, విమెన్ ఛాంపియన్ రియా రిప్లే,WWE ట్యాగ్ టీమ్ ఛాంపియన్ సమీ జైన్, కెవిన్ ఓవెన్స్‌ తోపాటు ఇంటర్‌ కాంటినెంటల్ ఛాంపియన్ గుంథర్, జిందర్ మహల్, వీర్, సంగ, డ్రూ మెక్‌ ఇంటైర్, బెక్కీ లించ్, నటల్య, మాట్ రిడిల్, లుడ్విగ్ కైజర్ హైదరాబాద్ చేరుకున్నారు. WWE ఈవెంట్ ఇండియాలో రెండవ సారి.. హైదరాబాద్‌లో మొదటి సారి జరుగుతోంది. హైదరాబాద్ డెవలప్ మెంట్ అద్భుతమన్నారు WWE స్టార్స్. రానున్న రోజుల్లో ఇండియా లో WWE ఈవెంట్స్ మరిన్ని జరగాలని కోరుకున్నారు. ప్రత్యేక ఆకర్షణగా ప్రపంచ హెవీ వెయిట్‌ ఛాంపియన్‌ సేథ్‌ ఫ్రికీన్‌ రోలిన్స్‌. ప్రత్యేక విమానంలో శంషాబాద్‌ చేరుకున్న ఆటగాళ్లు. ఆటగాళ్లను చూసేందుకు ఎయిర్‌పోర్ట్‌కు తరలివచ్చిన WWE ఫ్యాన్స్. 17 ఏళ్ల తర్వాత ఇండియాకు వచ్చిన లెజెండ్‌ జాన్‌సిన.


Similar News