Women’s T20 World Cup :ఎదురులేని ఆస్ట్రేలియా.. ఖాతాలో వరుసగా మూడో విజయం

మహిళల టీ20 వరల్డ్ కప్‌లో డిఫెండింగ్ చాంపియన్ ఆస్ట్రేలియాకు ఎదురులేకుండా పోయింది.

Update: 2024-10-11 17:21 GMT

దిశ, స్పోర్ట్స్ : మహిళల టీ20 వరల్డ్ కప్‌లో డిఫెండింగ్ చాంపియన్ ఆస్ట్రేలియాకు ఎదురులేకుండా పోయింది. ఆసిస్ మహిళల జట్టు హ్యాట్రిక్ విజయాన్ని నమోదు చేసింది. దుబాయ్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో పాకిస్తాన్‌పై 9 వికెట్ల తేడాతో నెగ్గింది. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన పాక్‌.. ఆసిస్ బౌలింగ్‌లో విలవిలాడింది. ముఖ్యంగా గార్డ్‌నెర్(4/21) ప్రత్యర్థి బ్యాటర్లను బెంబేలెత్తించింది. పాక్ ఇన్నింగ్స్‌లో అలియా రియాజ్(26) టాప్ స్కోరర్. ఆమె మాత్రం చెప్పుకోదగ్గ స్కోరు చేయగా.. మిగతా వారు విఫలమయ్యారు. దీంతో పాక్ 19.5 ఓవర్లలో 82 పరుగులకే ఆలౌటైంది. అనంతరం 83 పరుగుల లక్ష్యాన్ని ఆసిస్ ఒక్క వికెటే కోల్పోయి 11 ఓవర్లలోనే ఛేదించింది. కెప్టెన్ అలిస్సా హీలీ(37) కీలక పరుగులు జోడించి రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరగగా.. ఎల్లీస్ పెర్రీ(22 నాటౌట్), గార్డ్‌నెర్(7 నాటౌట్) మిగతా పని పూర్తి చేశారు. గ్రూపు-ఏలో వరుసగా మూడో విజయంతో ఆసిస్ జట్టు సెమీస్‌కు చేరువైంది. మరోవైపు, రెండో ఓటమితో పాక్ నాకౌట్ ఆశలు దాదాపుగా గల్లంతైనట్టే. 

Tags:    

Similar News