WTC Final 2023: స్టీవ్ స్మిత్, ట్రావిస్ హెడ్ జోడి అరుదైన ఘనత.. 111 ఏళ్ల రికార్డు బద్దలు

WTC Final 2023లో భాగంగా సెంచరీలతో చెలరేగిన ఆస్ట్రేలియా స్టార్ బ్యాటర్లు స్టీవ్ స్మిత్(268 బంతుల్లో 19 ఫోర్లతో 121), ట్రావిస్ హెడ్(174 బంతుల్లో 25 ఫోర్లు, సిక్స్‌తో 163) అరుదైన ఘనతను సొంతం చేసుకున్నారు.

Update: 2023-06-08 16:32 GMT

దిశ, వెబ్‌డెస్క్: WTC Final 2023లో భాగంగా సెంచరీలతో చెలరేగిన ఆస్ట్రేలియా స్టార్ బ్యాటర్లు స్టీవ్ స్మిత్(268 బంతుల్లో 19 ఫోర్లతో 121), ట్రావిస్ హెడ్(174 బంతుల్లో 25 ఫోర్లు, సిక్స్‌తో 163) అరుదైన ఘనతను సొంతం చేసుకున్నారు. ట్రావిస్ హెడ్, స్మిత్ నాలుగో వికెట్‌కు 285 పరుగులు జోడించారు. టెస్ట్ మ్యాచ్‌లో ఏ వికెట్‌కు అయినా అత్యధిక పరుగుల భాగస్వామ్యం అందించిన తొలి ఆసీస్ జోడీగా చరిత్రకెక్కారు. ఈ క్రమంలో 111 ఏళ్ల రికార్డును బద్దలు కొట్టారు.

1912లో ఆస్ట్రేలియా దిగ్గజ ఆటగాళ్లు వార్రెన్ బార్డ్‌స్లీ, చార్లెస్ కెల్లావే 3 వికెట్‌కు 242 పరుగులు నమోదు చేశారు. లార్డ్స్ మైదానం వేదికగా సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో ఆసీస్ దిగ్గజాలు ఈ ఫీట్ సాధించారు. ఓవల్ మైదానం వేదికగా 93 ఏళ్ల క్రితం సర్ డాన్ బ్రాడ్‌మన్, ఆర్చీ జాక్సన్ నమోదు చేసిన 243 పరుగుల భాగస్వామ్యాన్ని కూడా ట్రావిస్ హెడ్-స్మిత్ జోడీ అధిగమించింది.


Similar News