Rohit Sharma: సిరీస్ ఓటమిపై కెప్టెన్ రోహిత్ శర్మ రియాక్షన్

టెస్టు సిరీస్ ఓటమిపై టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ స్పందించారు. మ్యాచ్ అనంతరం ఆయన మాట్లాడారు. సిరీస్ కోల్పోవడం నిరాశ కలిగించిందని అన్నారు.

Update: 2024-10-26 11:28 GMT

దిశ, వెబ్‌డెస్క్: టెస్టు సిరీస్ ఓటమిపై టీమిండియా(Team India) కెప్టెన్ రోహిత్ శర్మ(Rohit Sharma) స్పందించారు. మ్యాచ్ అనంతరం ఆయన మాట్లాడారు. సిరీస్ కోల్పోవడం నిరాశ కలిగించిందని అన్నారు. ఇది తమ వైఫల్యమే అని చెప్పారు. వాంఖడే వేదికగా జరిగే మూడో టెస్టు మ్యాచ్‌లో తమ అత్యుత్తమ ప్రదర్శన ఇస్తామని కీలక వ్యాఖ్యలు చేశారు. కివీస్(New Zealand) అద్భుతంగా రాణిస్తోంది. అందివచ్చిన ప్రతీ అవకాశాన్ని అద్భుతంగా వాడుకుంటోందని అన్నారు. కాగా, టీమిండియా(Team India)కు వరుసగా రెండో ఓటమి ఎదురైంది. పుణే వేదికగా జరుగుతోన్న రెండో టెస్ట్ మ్యాచ్‌లోనూ భారత జట్టుపై 113 పరుగుల తేడాతో న్యూజిలాండ్‌ విజయం సాధించింది. దీంతో మరో టెస్టు మిగిలి ఉండగానే న్యూజిలాండ్(New Zealand) 2-0తో సిరీస్‌ కైవసం చేసుకుంది.

భారత బ్యాటర్లలో యశస్వి జైస్వాల్ (77), రవీంద్ర జడేజా (42) మినహా బ్యాటర్లెవరూ పెద్దగా పరుగులు చేయలేదు. మిచెల్ శాంట్నర్‌ మరోసారి గట్టి దెబ్బ కొట్టాడు. ఆరు వికెట్లు తీసి టీమిండియా పతనాన్ని శాసించారు. అయితే టీమిండియా(Team India) వైఫల్యానికి బ్యాటింగే కారణమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కెప్టెన్ రోహిత్ శర్మ(Rohit Sharma) కేవలం 8 పరుగుల వద్ద అవుట్ కాగా, విరాట్ కోహ్లీ(Virat Kohli) కేవలం 17 పరుగుల వద్ద ఔటయ్యాడు. చివరి వరకూ పోరాడిన జడేజా 42 పరుగులు చేసినా జట్టు ఓటమిని అడ్డుకోలేకపోయాడు.

Tags:    

Similar News