WTC Final: రోహిత్ శర్మపై మాజీ లెజెండ్‌ ఫైర్‌..

Update: 2023-06-12 10:01 GMT

దిశ, వెబ్‌డెస్క్: WTC Final 2023లో టీమ్ ఇండియా చిత్తుగా ఓడిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మ్యాచ్‌ అనంతరం కెప్టెన్ రోహిత్ శర్మ చేసిన వ్యాఖ్యలపై మాజీ క్రికెటర్స్ మండిపడుతున్నారు. డబ్ల్యూటీసీ విజేతను నిర్ణయించడానికి కేవలం ఒక్క మ్యాచ్ మాత్రమే పెట్టడం కరెక్ట్ కాదని రోహిత్ అన్నాడు. కనీసం మూడు మ్యాచులు పెట్టాలని, రెండింట్లో గెలిచిన వారిని విజేతలుగా ప్రకటించాలని చెప్పాడు. ఈ మ్యాచ్ ప్రారంభానికి ముందు వార్నర్ కూడా ఇదే మాట అన్నాడు. అయితే ఈ వాదనతో మాజీ లెజెండ్ సునీల్ గవాస్కర్ విభేదించాడు. రోహిత్ అభిప్రాయం కరెక్ట్ కాదన్నాడు. 'ఎంతో కాలం క్రితమే ఇది డిసైడ్ అయిపోయింది. డబ్ల్యూటీసీ సైకిల్ మొదటి మ్యాచ్ మొదలడానికి ముందే.. ఫైనల్ ఒక్కటే అని నిర్ణయిం చేశారు కదా. దానికి ప్రిపేర్ అవ్వాలి' అని గవాస్కర్ అభిప్రాయపడ్డాడు.

ఐపీఎల్ ఫైనల్ కోసం జట్లన్నీ సిద్ధం అవ్వడం లేదా? అని ప్రశ్నించాడు. 'ఐపీఎల్‌లో ఫైనల్ కోసం అందరూ రెడీ అవుతున్నారు కదా. అక్కడ ఎవరూ మూడు మ్యాచులు పెట్టండి అని అడగడం లేదే..?' అని.. అదే అప్పుడు కూడా ఓడిపోతే ఐదు మ్యాచ్‌లు పెట్టమని అడగరని గ్యారంటీ ఎంటీ సునీల్ గవాస్కర్ నిలదీశాడు.

WTC Final 2023 మ్యాచ్‌లో 444 పరుగుల లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ బరిలోకి దిగిన భారత్ 234 పరుగులకు కుప్పకూలింది. విరాట్ కోహ్లీ(78 బంతుల్లో 7 ఫోర్లతో 49), అంజిక్యా రహానే(108 బంతుల్లో 7 ఫోర్లతో 46), రోహిత్ శర్మ(60 బంతుల్లో 7 ఫోర్లు, సిక్స్‌తో 43) టాప్ స్కోరర్లుగా నిలిచారు. ఆసీస్ బౌలర్లలో నాథన్ లయన్ 4 వికెట్లు తీయగా.. స్కాట్ బోలాండ్ 3 వికెట్లు పడగొట్టాడు. మిచెల్ స్టార్క్‌కు 2 వికెట్లు దక్కగా.. ప్యాట్ కమిన్స్‌కు ఓ వికెట్ దక్కింది.


Similar News