WTC Final 2023: గిల్ ఔట్‌పై రోహిత్ శర్మ ఆసక్తికర కామెంట్స్..

WTC Final 2023లో భాగంగా ఆసీస్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమ్ ఇండియా ఓపెనర్ శుభ్‌మన్ గిల్ ఔటైన తీరుపై టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ అసంతృప్తి వ్యక్తం చేశాడు.

Update: 2023-06-11 15:31 GMT

దిశ, వెబ్‌డెస్క్: WTC Final 2023లో భాగంగా ఆసీస్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమ్ ఇండియా ఓపెనర్ శుభ్‌మన్ గిల్ ఔటైన తీరుపై టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ అసంతృప్తి వ్యక్తం చేశాడు. అంపైర్ తప్పుడు నిర్ణయం కారణంగానే గిల్ ఔటయ్యాడని తెలిపాడు. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్లో ఉపయోగించిన కెమెరాల్లో అల్ట్రా మోషన్, జూమ్ యాంగిల్స్ చూపించే టెక్నాలజీ లేకపోవడం ఏంటని అసహనం వ్యక్తం చేశాడు.

'ఐపీఎల్‌లో 10 విభిన్నమైన కోణాల్లో చూపించే కెమెరాలున్నాయి. శుభ్‌మన్ గిల్ క్యాచ్‌‌ను అల్ట్రా మోషన్, జూమ్ యాంగిల్స్‌లో ఎందుకు చూపించలేదో నాకు ఇప్పటికీ అర్థం కావడం లేదు.'అని రోహిత్ శర్మ అసహనం వ్యక్తం చేశాడు. ఇక డబ్ల్యూటీసీ విజేతను ఒక మ్యాచ్‌తో నిర్ణయించడం సరికాదని' రోహిత్ శర్మ అభిప్రాయపడ్డాడు. మూడు మ్యాచ్‌ల సిరీస్‌తో ఈ ఛాంపియన్‌షిప్ విజేతను తేల్చడం సరైనదని తెలిపాడు. మూడు మ్యాచ్‌ల సిరీస్‌తో డబ్ల్యూటీసీ ఫైనల్ నిర్వహించడం సరైన పద్దతి. గత రెండేళ్లలో మేం విదేశాల్లో అద్భుత విజయాలు అందుకున్నాం. ఆస్ట్రేలియా, ఇంగ్లండ్‌ గడ్డపై విజయాలు సాధించాం. మాకు దక్కిన అతి తక్కువ సమయంలోనే జట్టులోని ప్రతీ ఒక్కరు డబ్ల్యూటీసీ ఫైనల్ కోసం అద్భుతంగా ప్రిపేర్ అయ్యారు. ఇలాంటి కీలక మ్యాచ్‌లకు సిద్దం కావాలంటే కనీసం 20-25 రోజుల సమయం ఉండటం చాలా ముఖ్యమన్నాడు.

ఈ మ్యాచ్‌లో 444 పరుగుల లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ బరిలోకి దిగిన భారత్ 234 పరుగులకు కుప్పకూలింది. విరాట్ కోహ్లీ(78 బంతుల్లో 7 ఫోర్లతో 49), అంజిక్యా రహానే(108 బంతుల్లో 7 ఫోర్లతో 46), రోహిత్ శర్మ(60 బంతుల్లో 7 ఫోర్లు, సిక్స్‌తో 43) టాప్ స్కోరర్లుగా నిలిచారు. ఆసీస్ బౌలర్లలో నాథన్ లయన్ నాలుగు వికెట్లు తీయగా.. స్కాట్ బోలాండ్ మూడు వికెట్లు పడగొట్టాడు. మిచెల్ స్టార్క్‌కు రెండు వికెట్లు దక్కగా.. ప్యాట్ కమిన్స్‌కు ఓ వికెట్ దక్కింది.


Similar News