WTC Final 2023: ఏడో వికెట్ కోల్పోయిన ఆసీస్..

WTC Final 2023లో భాగంగా రెండోరోజు ఆటలో లంచ్‌ విరామం సమయానికి ఆస్ట్రేలియా 7 వికెట్ల నష్టానికి 422 పరుగులు చేసింది.

Update: 2023-06-08 12:08 GMT

దిశ, వెబ్‌డెస్క్: WTC Final 2023లో భాగంగా రెండోరోజు ఆటలో లంచ్‌ విరామం సమయానికి ఆస్ట్రేలియా 7 వికెట్ల నష్టానికి 422 పరుగులు చేసింది. అలెక్స్‌ కేరీ 22, పాట్‌ కమిన్స్‌ రెండు పరుగులతో ఆడుతున్నారు. రెండోరోజు ఆటలో తొలి సెషన్‌లో టీమిండియా బౌలర్లు నాలుగు వికెట్లు తీసి కాస్త ఆధిపత్యం ప్రదర్శించారు.

అక్షర్‌ పటేల్‌ మెరుపు ఫీల్డింగ్‌.. మిచెల్‌ స్టార్క్‌ రనౌట్‌..

టీమిండియా స్పిన్నర్‌ అక్షర్‌ పటేల్‌ స్టన్నింగ్‌ రనౌట్‌తో మెరిశాడు. సిరాజ్‌ బౌలింగ్‌లో మిడాన్‌ దిశగా బంతిని పుష్‌ చేశాడు. సింగిల్‌ రిస్క్‌ అని తెలిసినప్పటికి క్రీజు దాటాడు. అయితే బంతిని అందుకున్న అక్షర్‌ పటేల్‌ బంతిని డైరెక్ట్‌ హిట్‌ చేశాడు. దీంతో స్టార్క్‌ రనౌట్‌ అయ్యాడు. ప్రస్తుతం ఆసీస్‌ ఏడు వికెట్ల నష్టానికి 406 పరుగులు చేసింది.


Similar News