WTC Final 2023: మూడో వికెట్‌ కోల్పోయిన ఆస్ట్రేలియా..

తొలి ఇన్నింగ్స్‌ సెంచరీ హీరో స్టీవ్‌ స్మిత్‌ రెండో ఇన్నింగ్స్‌లో జడ్డూకు చిక్కాడు.

Update: 2023-06-09 16:34 GMT

దిశ, వెబ్‌డెస్క్: తొలి ఇన్నింగ్స్‌ సెంచరీ హీరో స్టీవ్‌ స్మిత్‌ రెండో ఇన్నింగ్స్‌లో జడ్డూకు చిక్కాడు. 34 పరుగులు చేసిన స్మిత్‌ జడేజా బౌలింగ్‌లో భారీ షాట్‌కు ట్రై చేసి.. శార్దూల్‌ ఠాకూర్‌కు క్యాచ్‌ ఇచ్చాడు. మూడు వికెట్ల నష్టానికి 104 పరుగులతో ఆడుతున్న ఆసీస్‌ 277 పరుగుల ఆధిక్యంలో ఉంది.

టీమిండియా 296 ఆలౌట్‌.. ఆసీస్‌కు 173 పరుగుల ఆధిక్యం..

అంతకుముందు టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో 296 పరుగులకు ఆలౌట్‌ అయింది. దీంతో ఆసీస్‌కు 173 పరుగుల తొలి ఇన్నింగ్స్‌ ఆధిక్యం లభించింది. అజింక్యా రహానే 89 పరుగులతో టాప్‌ స్కోరర్‌ కాగా.. శార్దూల్‌ఠాకూర్‌ 51, జడేజా 48 పరుగులు చేశారు. ఆసీస్‌ బౌలర్లలో కమిన్స్‌ మూడు, స్టార్క్‌, బోలాండ్‌, గ్రీన్‌ తలా రెండు వికెట్లు తీయగా.. లియోన్‌ ఒక వికెట్‌ పడగొట్టాడు.


Similar News