‘సిక్సర్ల’కు కాన్పూర్ ‘స్టాండ్’ నిలబడేనా?

బంగ్లాదేశ్ ‌పై తొలి టెస్టులో గ్రాండ్ విక్టరీ కొట్టిన టీమిండియా రెండో టెస్టుపై కన్నేసింది. ఈ టెస్టులోనూ విజయం సాధించి సిరీస్‌ను 2-0 తేడాతో క్లీన్‌స్వీప్‌ చేయాలని రోహిత్‌ సేన భావిస్తోంది.

Update: 2024-09-25 18:54 GMT

దిశ, స్పోర్ట్స్ : బంగ్లాదేశ్ ‌పై తొలి టెస్టులో గ్రాండ్ విక్టరీ కొట్టిన టీమిండియా రెండో టెస్టుపై కన్నేసింది. ఈ టెస్టులోనూ విజయం సాధించి సిరీస్‌ను 2-0 తేడాతో క్లీన్‌స్వీప్‌ చేయాలని రోహిత్‌ సేన భావిస్తోంది.అయితే, రెండో టెస్టు జరిగే కాన్పూర్‌ స్టేడియంలోని పరిస్థితులపై పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.ఈ స్టేడియంలోని ఒక స్టాండ్‌ బలహీనంగా ఉండటమే ఇందుకు కారణం. అయితే, 2021 తర్వాత కాన్పూర్‌ వేదికగా టెస్టు మ్యాచులు జరగలేదు. దాదాపు రెండేళ్ల తర్వాత మళ్లీ తొలిసారి కాన్పూర్ స్టేడియాంలో జరుగుతున్న తొలి టెస్టు ఇదే. అయితే, మ్యాచులు లేకపోవడంతో స్టేడియం మెయింటెన్స్‌ను అధికారులు పక్కన పడేసినట్లు తెలుస్తోంది.

ఈ క్రమంలోనే స్టేడియంలోని ఒక స్టాండ్‌ బలహీనంగా ఉన్నట్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఇదే విషయాన్ని ఉత్తర ప్రదేశ్‌ పబ్లిక్‌ వర్క్స్‌ డిపార్ట్‌మెంట్‌ పేర్కొంటుందని జాతీయ మీడియా కథనం వచ్చింది. పూర్తి స్థాయి సామర్థ్యం మేరకు అభిమానులు నిండితే, ఆ స్టాండ్‌ కూలిపోయే ప్రమాదముందని అధికారులు తెలిపినట్ల మీడియా కథనం ఉంది. అందువల్లే ఆ స్టాండ్‌లో సగానికంటే తక్కువగా టికెట్లు విక్రయిస్తున్నట్లు వెల్లడించింది. ‘బాల్కనీ (సి) స్టాండ్‌పై పీడబ్ల్యూడీ కొన్ని సమస్యలను మా దృష్టికి తీసుకొచ్చింది. వాటితో మేము ఏకీభవించాము. అందులో సగానికంటే ఎక్కువ టికెట్లు అమ్మడం లేదు. ఈ స్టాండ్‌ కెపాసిటీ 4,800 కాగా, కేవలం 1700 టికెట్లు మాత్రమే అమ్మాలని మాకు చెప్పారు. మరమ్మతు పనులు రెండు రోజుల పాటు కొనసాగుతాయి’ అని యూపీ క్రికెట్‌ అసోసియేషన్‌ సీఈవో అంకిత్‌ ఛటర్జీ తెలిపినట్లు సమాచారం.

బాల్కనీ సి పరిస్థితి ఆందోళనకరంగా ఉందని.. ఇంజినీర్ల బృందం అక్కడ చాలా సేపు పరిశీలించిందని.. మ్యాచ్‌ జరిగే సమయంలో దానిని మూసివేయాలని యూపీ క్రికెట్‌ అసోసియేషన్‌ను పీడబ్లూడీ ఇంజినీర్‌ హెచ్చరించినట్లు సమాచారం. ‘ఒకవేళ రిషభ్‌ పంత్‌ సహా మన బ్యాటర్లు భారీ సిక్స్‌ కొడితే.. అభిమానులు ఎగిరి గంతేస్తే.. 50 మంది ప్రేక్షకుల బరువును కూడా ఈ స్టాండ్‌ మోయలేదు. వెంటనే మరమ్మతులు చేయాలి’ అని ఓ ఇంజినీర్‌ చెప్పినట్లు మీడియా కథనం పేర్కొ్ంది.ఇదిలాఉండగా, బంగ్లాదేశ్‌తో రెండో టెస్టు కాన్పూర్‌ వేదికగా ఈ నెల 27 నుంచి ప్రారంభం కానుంది. టీమ్‌ఇండియా జట్టులో ఎలాంటి మార్పులు చేయకుండా రెండో టెస్టుకు సైతం బీసీసీఐ అదే జట్టును ఎంపిక చేసింది.

Tags:    

Similar News