రోహిత్‌ను తొలగించి.. వారిద్దరిలో ఒకరిని కెప్టెన్ చేయండి : మాజీ సెలెక్టర్

డబ్ల్యూటీసీ ఫైనల్‌లో భారత జట్టు ఘోరంగా ఓడిన విషయం తెలిసిందే.

Update: 2023-06-14 10:30 GMT

దిశ, వెబ్‌డెస్క్: డబ్ల్యూటీసీ ఫైనల్‌లో భారత జట్టు ఘోరంగా ఓడిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో భారత కెప్టెన్‌గా రోహిత్‌ను తొలగింస్తారని వార్తలు వినిపిస్తున్నాయి. దీనికితోడు రోహిత్ బ్యాటింగ్‌లో కూడా విఫలమయ్యాడు. టెస్టుల్లో నుంచి రోహిత్‌ నుంచి కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టే అర్హత వెటరన్‌ ఆటగాళ్లు రవిచంద్రన్ అశ్విన్, అజింక్యా రహానెలకు ఉందని మాజీ సెలెక్టర్ దేవాంగ్ గాంధీ అభిప్రాయపడ్డాడు. ఈ మ్యాచ్ తర్వాత కొత్త డబ్ల్యూటీసీ ఫైనల్ మొదలైంది. భారత జట్టు తమ తొలి మ్యాచ్‌లో వెస్టిండీస్‌ను ఎదుర్కొంటుంది. అయితే ఈ సిరీసులో కూడా ఛటేశ్వర్ పుజారా వంటి ప్లేయర్లకు అవకాశం ఇవ్వడంపై మాజీ సెలెక్టర్ దేవాంగ్ గాంధీ అసంతృప్తి వ్యక్తం చేశాడు. అతని కన్నా యశస్వి జైస్వాల్ వంటి కుర్రాళ్లకు ఛాన్స్ ఇస్తే అద్భుతంగా ఉంటుందని దేవాంగ్ గాంధీ అభిప్రాయపడ్డాడు.

'వెస్టిండీస్‌తో టెస్టు సిరీసులో పుజారాను ఆడించడమే నాకు తెలిసి సమస్య. అతను ఆడితే మరో ఏడాదిపాటు అతనికి అవకాశం దొరుకుతుంది. ఎందుకంటే ఈ సిరీస్ తర్వాత డిసెంబర్ వరకు మళ్లీ టెస్టులో లేవు. ఇలాంటి సమయంలో పుజారాను ఆడిస్తారా.. లేకపోతే కుర్రాడికి అవకాశం ఇచ్చి, పెద్ద మ్యాచులకు అతన్ని రెడీ చేస్తారా?' అని గాంధీ ప్రశ్నించాడు. భవిష్యత్తులో భారత జట్టు కెప్టెన్సీ శుభ్‌మన్ గిల్‌కు దక్కుతాయని గాంధీ అభిప్రాయపడ్డాడు. అప్పటి వరకు జట్టు పగ్గాలను రవిచంద్రన్ అశ్విన్ లేదంటే అజింక్య రహానే వంటి వారికి ఇస్తే బాగుంటుందన్నాడు. వెస్టిండీస్‌తో భారత్ ఆడే తొలి టెస్టు జులై 12న మొదలవుతుందనే సంగతి తెలిసిందే. 


Similar News