WTC 2023 ఫైనల్‌కు వరుణ గండం.. మ్యాచ్ రద్దయితే విజేత ఎవరంటే..?

జూన్ 7-11 వరకు లండన్‌లోని ఓవల్ మైదానం వేదికగా జరగనున్న ఈ మెగా ఫైనల్లో భారత్, ఆస్ట్రేలియా అమీతుమీ తేల్చుకున్నాయి.

Update: 2023-06-02 10:47 GMT

దిశ, వెబ్‌డెస్క్: జూన్ 7-11 వరకు లండన్‌లోని ఓవల్ మైదానం వేదికగా జరగనున్న ఈ మెగా ఫైనల్లో భారత్, ఆస్ట్రేలియా అమీతుమీ తేల్చుకున్నాయి. ఆస్ట్రేలియాకు ఇది తొలి ఫైనల్ కాగా.. టీమిండియా వరుసగా రెండోసారి డబ్ల్యూటీసీ ఫైనల్ చేరింది. ఇంగ్లండ్ వేదికగానే డబ్ల్యూటీసీ 2019-21 ఎడిషన్‌ ఫైనల్ జరగ్గా.. న్యూజిలాండ్ ఛాంపియన్‌గా నిలిచింది. ఫైనల్ మ్యాచ్‌లో టీమిండియాను ఓడించి విశ్వవిజేతగా నిలిచింది. ఈ క్రమంలోనే గతేడాది చేజారిన డబ్ల్యూటీసీ టైటిల్‌ను ఈసారి ఎలాగైనా సాధించాలని టీమిండియా భావిస్తోంది. ఇప్పటికే భారత, ఆస్ట్రేలియా క్రికెటర్లు ప్రాక్టీస్ కూడా మొదలుపెట్టేశారు. భారత కాలమాన ప్రకారం.. మ్యాచ్ జూన్ 7న మధ్యాహ్నం 3:30 గంటలకి ప్రారంభంకానుంది. అయితే ఈ మ్యాచ్ వర్షం గండం పొంచి ఉండటం అభిమానులను ఆందోళనకు గురిచేస్తోంది.

ఓవల్‌లో తొలి నాలుగు రోజులు వర్షం పడే అవకాశాలు లేవని పేర్కొన్న వాతావరణ శాఖ.. ఐదో రోజు మాత్రం 56% వర్షం కురిసే చాన్స్ ఉందని హెచ్చరించింది. ఈ మ్యాచ్‌కు రిజర్వ్ డే ఉన్నప్పటికీ అభిమానుల ఆందోళనకు గురవుతున్నారు. డబ్ల్యూటీసీ ఫైనల్‌కు రిజర్వ్ డే ఉన్నప్పటికి ఇంగ్లండ్ వాతావరణం ఎప్పుడు ఎలా ఉంటుందో చెప్పడం కష్టమని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఒక వేళ వర్షం కారణంగా ఈ మ్యాచ్ రద్దయినా.. ఫలితం తేలకుండా ముగిసినా ట్రోఫీని ఇరు జట్లు పంచుకోనున్నాయి.

Tags:    

Similar News