సౌతాఫ్రికాపై టీ20 సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేసిన విండీస్

టీ20 ప్రపంచకప్‌కు ముందు వెస్టిండీస్ సంచలన ప్రదర్శన చేసింది. సొంతగడ్డపై సౌతాఫ్రికాతో జరిగిన టీ20 సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేసింది.

Update: 2024-05-27 13:26 GMT

దిశ, స్పోర్ట్స్ : టీ20 ప్రపంచకప్‌కు ముందు వెస్టిండీస్ సంచలన ప్రదర్శన చేసింది. సొంతగడ్డపై సౌతాఫ్రికాతో జరిగిన టీ20 సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేసింది. ఆదివారం అర్ధరాత్రి జరిగిన మూడో టీ20లో నెగ్గడంతో సిరీస్ 3-0తో విండీస్ కైవసమైంది. ఆ మ్యాచ్‌లో సౌతాఫ్రికాను 8 వికెట్ల తేడాతో కరేబియన్ జట్టు ఓడించింది. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేసిన సఫారీలు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 163 పరుగులు చేశారు. కెప్టెన్ వాన్ డెర్ డస్సెన్(51) హాఫ్ సెంచరీతో సత్తాచాటగా.. వియాన్ ముల్డర్(36) పర్వాలేదనిపించాడు. ఒబెడ్ మెక్కాయ్(3/39), మోటీ(2/21), షామర్ జోసెఫ్(2/26) బంతితో మెరిసి దక్షిణాఫ్రికాను మోస్తరు స్కోరుకే కట్టడి చేశారు.

అనంతరం లక్ష్యాన్ని విండీస్ జట్టు అలవోకగా ఛేదించింది. 2 వికెట్లు మాత్రమే కోల్పోయి 165 పరుగులు చేసింది. జాన్సన్ చార్లెస్(69) మెరుపు అర్ధ శతకంతో రెచ్చిపోగా.. కెప్టెన్ బ్రాండన్ కింగ్(44), కైల్ మేయర్స్(36 నాటౌట్) రాణించారు. దీంతో 13.5 ఓవర్లలోనే వెస్టిండీస్ విజయతీరాలకు చేరింది. టీ20 వరల్డ్‌కప్‌కు అమెరికాతోపాటు విండీస్ ఆతిథ్యమిస్తున్న విషయం తెలిసిందే. ఈ టోర్నీలో జూన్ 2న పపువా న్యూ గినియాతో వెస్టిండీస్ తొలి మ్యాచ్ ఆడనుంది. 

Tags:    

Similar News