IND vs NZ 2nd Test: ఏడు వికెట్లతో రెచ్చిపోయిన సుందర్.. న్యూజిలాండ్ ఆలౌట్

భారత్, న్యూజిలాండ్ IND vs NZ మధ్య మూడు టెస్టు మ్యాచ్ ల సిరీస్ నడుస్తోంది. ఇందులో భాగంగా ఈ రోజు(గురువారం) పూణే(PUNE) వేదికగా రెండో టెస్టు మ్యాచ్ ప్రారంభం అయింది.

Update: 2024-10-24 10:31 GMT

దిశ, వెబ్ డెస్క్: భారత్, న్యూజిలాండ్ IND vs NZ మధ్య మూడు టెస్టు మ్యాచ్ ల సిరీస్ నడుస్తోంది. ఇందులో భాగంగా ఈ రోజు(గురువారం) పూణే(PUNE) వేదికగా రెండో టెస్టు మ్యాచ్ ప్రారంభం అయింది. ఇందులో టాస్ గెలిచిన న్యూజిలాండ్(New Zealand) జట్టు మొదట బ్యాటింగ్ ఎంచుకుంది. దీంతో భారత్ బౌలింగ్ చేయాల్సి వచ్చింది. అయితే ఈ మ్యాచులో మొదటి రెండు సెషన్‌లలో ఆచుతూచి ఆడిన న్యూజిలాండ్ జట్టుకు వాషింగ్టన్ సుందర్(Washington Sundar), రవిచంద్రన్ అశ్విన్(Ravichandran Ashwin) చుక్కలు చూపించారు. ముఖ్యంగా లంచ్ బ్రేక్ తర్వాత సుందర్ తన బంతితో మాయాజాలం చేశాడు. ఏకంగా 7 వికెట్లను పడగొట్టి.. న్యూజిలాండ్ బ్యాటర్లను వచ్చిన వారిని వచ్చినట్లే వెనక్కి పంపాడు. ఈ మొదటి ఇన్నింగ్స్ లో మొత్తం పది వికెట్లను ఇద్దరు బౌలర్లు, అది కూడా స్పిన్నర్లు తీసుకున్నారు. దీంతో న్యూజిలాండ్ బ్యాటర్లు కాన్వే 76, రచిన్ రవీంద్ర 65, శాంట్నర్ 33, విల్ యంగ్ 18, లాథమ్ 15, డారీ మిచెల్ 18 పరుగులు చేశారు. దీంతో మొదటి ఇన్నింగ్స్‌లో న్యూజిలాండ్ జట్టు 79.1 ఓవర్లకు 259 పరుగుల వద్ద ఆలౌట్ అయింది.


Similar News