INDW vs NZW: న్యూజిలాండ్ పై భారత్ ఘన విజయం

మహిళల టీ20 ప్రపంచ కప్ తర్వాత న్యూజిలాండ్ జట్టు భారత్తో మూడు మ్యాచ్ల వన్డే సిరీస్ ఆడుతుంది. ఇందులో భాగంగా మొదటి వన్డే మ్యాచ్ ఈ రోజు ఆహ్మదాబాద్ వేదికగా జరిగింది.

Update: 2024-10-24 15:09 GMT

దిశ, వెబ్ డెస్క్: మహిళల టీ20 ప్రపంచ కప్ తర్వాత న్యూజిలాండ్ జట్టు భారత్తో మూడు మ్యాచ్ల వన్డే సిరీస్ ఆడుతుంది. ఇందులో భాగంగా మొదటి వన్డే మ్యాచ్ ఈ రోజు ఆహ్మదాబాద్ వేదికగా జరిగింది. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన భారత్ మొదట బ్యాటింగ్ ఎంచుకుంది. న్యూజిలాండ్ బౌలర్లు కట్టుదిట్టమైన బౌలింగ్ వేయడం తో భారత్ బ్యాటర్లు తక్కువ స్కోరుకే ఆలౌట్ అయ్యారు. ఈ మ్యాచులో 44.3 ఓవర్లు ఆడిన భారత జట్టు 227 పరుగులకు ఆలౌట్ అయింది. ఇందులో షెఫాలి వర్మ 33, యస్టికా బాటియా 37, జెమిమా 35, తెజల్ 42, దీప్తి శర్మ 41, అరుంధతి రెడ్డి 14 పరుగుల మాత్రే చేశారు. న్యూజిలాండ్ బౌలర్లలో Amelia Kerr నాలుగు వికెట్లు, జెస్ కెర్ 3 వికెట్లు తీసుకున్నారు. అనంతరం 228 పరుగుల లక్ష్యంతో చేజింగ్ కు దిగిన న్యూజిలాండ్ బ్యాటర్లకు భారత బౌలర్లు చుక్కలు చూపించారు. అలాగే అద్బుతమైన ఫీల్డింగ్ ప్రదర్శనతో ముగ్గురిని అవుట్ చేసి.. న్యూజిలాండ్ జట్టును కష్టాల్లోకి నెట్టారు. దీంతో ఆ జట్టు 40.4 ఓవర్లకు 168 పరుగులు చేసి ఆలౌట్ అయింది. దీంతో భారత్ 59 పరుగుల తేడాతో విజయం సాధించి మూడు వన్డే మ్యాచుల సిరీస్ లో 1-0 తో లీడ్ లో ఉంది. ఈ మ్యాచులో భారత బౌలర్లలో సైమా టాకూర్ 2, రాదా యాదవ్ 3, దీప్తి శర్మ, అరుంధతి రెడ్డి చెరో వికెట్ తీసుకున్నారు.


Similar News