ఇదేమీ 'స్టీవ్ వా' టీమ్ కాదు.. ఆసీస్‌కు అంత సీన్ లేదు : సౌరవ్ గంగూలీ
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ భాగంగా టీమిండియా 2-0తో తిరుగులేని ఆధిక్యం సంపాదించింది.
దిశ, వెబ్‌డెస్క్: బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ భాగంగా టీమిండియా 2-0తో తిరుగులేని ఆధిక్యం సంపాదించింది. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ ఆసీస్ జట్టుపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. ఇండియాను ఇండియాలో ఓడించడం దాదాపు అసాధ్యమని.. అయినా ఇదేమీ ‘స్టీవ్ వా’ టీమ్ కాదని గంగూలీ సంచలన కామెంట్స్ చేశాడు. ప్రస్తుత ఆసీస్ టీమ్‌లో స్మిత్, వార్నర్, లబుషేన్ లాంటి వాళ్లు ఉన్నా.. ఇండియన్ కండిషన్స్‌లో ఆడటం వాళ్లకు అంత తేలిక కాదని స్పష్టం చేశాడు.
ఆసీస్ జట్టులో మాథ్యూ హేడెన్, జస్టిన్ లాంగర్, రిక్కీ పాంటింగ్, స్టీవ్ వా, మార్క్ వా, గిల్‌క్రిస్ట్ లాంటి వాళ్లు లేరు. ఆ క్వాలిటీ ఇప్పటి జట్టులో లేదని.. ఇది ‘స్టీవ్ వా’ ఆస్ట్రేలియా టీమ్ అనుకోవడమే మనం చేస్తున్న తప్పని గంగూలీ అభిప్రాయపడ్డాడు. ఆస్ట్రేలియా ను ఇండియా 4-0తో ఓడించడం సాధ్యమే అని ఈ సందర్భంగా గంగూలీ అభిప్రాయపడ్డాడు.