వందో టెస్ట్‌లో వార్నర్ సెంచరీ: ఈ ఫీట్ సాధించిన క్రికెటర్లు వీరే..

దక్షిణాఫ్రితాతో మెల్‌బోర్న్‌లో జరుగుతున్న తొలిటెస్ట్‌లో వార్నర్ రికార్డు సృష్టించాడు.

Update: 2022-12-27 03:53 GMT

దిశ, వెబ్ డెస్క్: దక్షిణాఫ్రితాతో మెల్‌బోర్న్‌లో జరుగుతున్న తొలిటెస్ట్‌లో వార్నర్ రికార్డు సృష్టించాడు. వందో టెస్ట్ ఆడుతున్న వార్నర్ సెంచరీ చేసి అరుదైన ఫీట్ సొంతం చేసుకున్నాడు. 144 బాల్స్‌లో సెంచరీ మార్క్‌కు చేరుకున్నాడు. టెస్ట్‌ల్లో వందో మ్యాచ్ ఆడుతూ ఈ ఫీట్‌ను ఇప్పటివవరకు తొమ్మిది మంది సాధించగా వార్నర్ పదో ఆటగాడిగా నిలిచాడు. కొలిన్ కోడ్రీ(104), జావెద్ మియాందాద్(145), గోర్డొన్ గ్రీనిడ్జ్(149), అలెక్స్ స్టీవర్ట్(105), ఇంజామమ్ ఉల్ హక్(184), రికీ పాంటింగ్(120), గ్రీమ్ స్మిత్(131), హషీమ్ ఆమ్లా(134), జో రూట్(218) వందో టెస్ట్‌లో సెంచరీ సాధించారు.

కాగా టెస్ట్‌ల్లో వార్నర్ ఓపెనర్ బ్యాట్స్‌మెన్‌గా వచ్చి అత్యధిక సెంచరీలు సాధించిన ఐదో ఆటగాడిగా నిలిచాడు. ఓపెనర్ బ్యాట్స్‌మెన్‌గా వచ్చి సునీల్ గవాస్కర్ (33), అలెస్టర్ కుక్(31), మాథ్యూహెడేన్(30), గ్రీమ్ స్మిత్ (27) సెంచరీలు చేయగా డేవిడ్ వార్నర్ 25 సెంచరీలతో జాబితాలో ఐదో స్థానంలో నిలిచాడు. ఇదే టెస్ట్ మ్యాచ్‌లో 8వేల పరుగుల ఆటగాడి జాబితాలో వార్నర్ నిలివడం మరో విశేషం. తొలి టెస్ట్‌లో దక్షిణాఫ్రికా 189 పరుగులకు ఆలౌట్ కాగా ఆసీస్ 205 పరుగులు చేసి రెండు వికెట్లు కోల్పోయింది. వార్నర్ 124 పరుగులతో నాటౌట్ గా నిలిచి బ్యాటింగ్ కొనసాగిస్తున్నాడు. 


Similar News