బ్యాటింగే కాదు.. ఫీల్డింగూ ఇష్టమే : రింకు సింగ్

తనకు బ్యాటింగ్‌తోపాటు ఫీల్డింగ్ అంటే కూడా చాలా ఇష్టమని టీమ్ ఇండియా యువ బ్యాటర్ రింకు సింగ్ తెలిపాడు.

Update: 2024-07-15 13:47 GMT

దిశ, స్పోర్ట్స్ : తనకు బ్యాటింగ్‌తోపాటు ఫీల్డింగ్ అంటే కూడా చాలా ఇష్టమని టీమ్ ఇండియా యువ బ్యాటర్ రింకు సింగ్ తెలిపాడు. జింబాబ్వేతో టీ20 సిరీస్‌ను టీమ్ ఇండియా 4-1తో సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ సిరీస్‌కు సంబంధించి ‘ఫీల్డర్ ఆఫ్ ది సిరీస్’ మెడల్ రింకు సింగ్‌ను వరించింది. డ్రెస్సింగ్ రూంలో జరిగిన మెడల్ సెర్మనీని బీసీసీఐ సోమవారం ఎక్స్ వేదికగా పంచుకుంది.

మొదట ఈ సిరీస్‌కు ఫీల్డింగ్ కోచ్‌గా ఉన్న సుభదీప్ ఘోష్ మాజీ ఫీల్డింగ్ కోచ్ టి. దిలీప్ ఫీల్డింగ్ ఆవశ్యకతను వివరించిన వీడియోను ఆటగాళ్లకు చూపెట్టాడు. ఆ తర్వాత ఘోష్ రింకూను విజేతగా ప్రకటించగా.. వీవీఎస్ లక్ష్మణ్ రింకూకు మెడల్ అందజేసి అభినందించాడు. ఈ సందర్భంగా రింకు మాట్లాడుతూ..‘ఇది 4 లేదా 5వ సిరీస్. అందరితో కలిసి ఆడటం ఎంజాయ్ చేశాను. బ్యాటింగ్, ఫీల్డింగ్ అంటే నాకు చాలా ఇష్టం.’ అని చెప్పాడు. అంతకుముందు స్పిన్నర్ రవి బిష్ణోయ్ స్టూల్‌పై ఎక్కి మాట్లాడాలని రింకూను కోరాడు. అతను నిరాకరించడంతో వీవీఎస్ లక్ష్మణ్, రవి బిష్ణోయ్, గిల్ పట్టుబట్టడంతో డ్రెస్సింగ్ రూంలో సందడి వాతావరణం నెలకొంది. మొత్తానికి రింకు స్టూల్‌పై నిల్చునే మాట్లాడాడు.


Similar News