వీర జవాన్ల పిల్లలకు ఉచితంగా విద్య.. మాట నిలబెట్టుకున్న వీరేంద్ర సెహ్వాగ్

పుల్వమా ఉగ్రదాడిలో ప్రాణాలు కొల్పోయిన వీర జవాన్ల పిల్లల బాధ్యతలను టీమిండియా మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ తీసుకున్నారు.

Update: 2023-02-15 08:04 GMT

దిశ, వెబ్‌డెస్క్: పుల్వమా ఉగ్రదాడిలో ప్రాణాలు కొల్పోయిన వీర జవాన్ల పిల్లల బాధ్యతలను టీమిండియా మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ తీసుకున్నారు. 2019 ఫిబ్రవరి 14.. ప్రేమికుల దినోత్సవం రోజున మన దేశం మొత్తం ఉలిక్కిపడిన రోజు.. జమ్మూ కశ్మీర్‌లోని పుల్వామా వద్ద ఉగ్రదాడి జరిగి మొత్తం 40 మంది జవాన్లు అమరులయ్యారు. పుల్వామా ఉగ్రదాడి లో చనిపోయిన సైనికుల పిల్లలను ఉచితంగా చదివిస్తానని ఆ సమయంలో మాట ఇచ్చాడు. ఏదో భావోద్వేగంలో మాటిచ్చాడేమో అనుకున్నారు చాలామంది. అయితే సెహ్వాగ్‌ మాత్రం తన మాటలను మరుక్షణమే ఆచరణలోకి తెచ్చాడు.

పుల్వామా ఉగ్రదాడి జరిగి నేటితో నాలుగేళ్లు పూర్తి అవుతుంది. ఈ సందర్భంగా తన స్కూల్‌లో చదువుతోన్న జవాన్ల పిల్లల ఫొటోలను సోషల్‌ మీడియాలో షేర్‌ చేశాడు. 'పుల్వామా అటాక్‌లో అమరులైన సైనికుల జీవితాల్లో చిన్న పాటి వెలుగు నింపుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. రామ్ వకీల్ కుమారుడు అర్పిత్ సింగ్, విజయ్‌ కుమారుడు రాహుల్‌లను చదివిస్తున్నందుకు నాకెంతో ఆనందంగా ఉంది' అని సెహ్వాగ్‌ తన ట్విట్టర్‌ ద్వారా పంచుకున్నాడు. ప్రస్తుతం ఈ పోస్ట్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. సెహ్వాగ్‌ అమర జవాన్ల పిల్లల చదువు బాధ్యతను తీసుకోవడం చాలా గొప్ప విషయమంటూ ఫ్యాన్స్‌ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

Tags:    

Similar News