దిశ, వెబ్‌డెస్క్: విరాట్ సోమవారం కోట్లాదిమంది అభిమానులను షాక్‌కు గురి చేశాడు. ఈ స్టార్ బ్యాటర్ ముఖంపై గాయాలు, ముక్కుపై బ్యాండేజి ఉన్న ఫొటోను తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు. అందులో కోహ్లీ తెలుపు రంగు టీ షర్ట్ వేసుకున్నాడు. ఎడమ కన్ను నల్లగా కమిలిపోయి ఉంది. కుడి చెంప, నుదురు భాగంలో చిన్న గాటులాంటి గాయం ఉంది. ఆ పోస్ట్ చూసిన ఫ్యాన్స్ ‘విరాట్ కోహ్లీకి ఏమైంది..’ అని కంగారుపడ్డారు. క్షణాల్లో ఆ ఫోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే.. ఆ ఫొటోకు రన్ మెషీన్ మీరు మరొక వ్యక్తిని చూస్తారు అని క్యాప్షన్ రాశాడు. అంతేకాదు ఆ ఫొటోలో కోహ్లీ నవ్వుతూ విజయ సంకేతం చూపిస్తున్నాడు. దాంతో అంతా ఒక్కసారి ఊపిరి పీల్చుకున్నారు. వరల్డ్ కప్‌లో కోహ్లీ రెండు సెంచరీలతో కలిపి 765 రన్స్ కొట్టాడు. అత్యధిక పరుగుల వీరుడిగా నిలిచి.. ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ అవార్డు అందుకున్నాడు. ఐపీఎల్ 17వ సీజన్‌కు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు కోహ్లీని అట్టిపెట్టుకుంది. ఆ మరుసటి రోజే అంటే.. నవంబర్ 27న కోహ్లీ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ పెట్టాడు.