ఒడిషా రైలు ప్రమాద ఘటనపై విరాట్ కోహ్లీ ఎమోషనల్ ట్వీట్

ఒడిషా రైలు ప్రమాదం దేశవ్యాప్తంగా తీవ్ర విషాదాన్ని నింపింది. శుక్రవారం రాత్రి హౌరా నుండి చెన్నై వెళ్తున్న కోరమాండల్ ఎక్స్ ప్రెస్ ట్రైన్ ఒడిషాలోని బాలేశ్వర్ స్టేషన్ వద్ద ప్రమాదానికి గురైంది.

Update: 2023-06-03 08:39 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఒడిషా రైలు ప్రమాదం దేశవ్యాప్తంగా తీవ్ర విషాదాన్ని నింపింది. శుక్రవారం రాత్రి హౌరా నుండి చెన్నై వెళ్తున్న కోరమాండల్ ఎక్స్ ప్రెస్ ట్రైన్ ఒడిషాలోని బాలేశ్వర్ స్టేషన్ వద్ద ప్రమాదానికి గురైంది. కోరమాండల్ రైలు అతి వేగంతో ఆగి ఉన్న గూడ్స్ రైలును ఢీకొట్టడంతో పెను ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘోర రైలు ప్రమాదంలో ఇప్పటి వరకు దాదాపు 280 మంది వరకు చనిపోగా.. మరో 900 మంది ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. యావత్ దేశాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిన ఈ ఘటనపై పలువురు రాజకీయ, సినీ, క్రీడా ప్రముఖులు స్పందింస్తున్నారు.

సోషల్ మీడియా వేదికగా సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఇందులో భాగంగా టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ కోరమాండల్ రైలు ప్రమాద ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ట్విట్టర్ వేదికగా కోహ్లీ మృతులకు సంతాపం తెలిపారు. ‘‘ఒడిశాలో జరిగిన ఘోర రైలు ప్రమాదం గురించి విని బాధపడ్డాను. నా ఆలోచనలు మరియు ప్రార్థనలు ప్రియమైన వారిని కోల్పోయిన బాధిత కుటుంబాలకు వెళ్తాయి. గాయపడినవారు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను’’ అని కోహ్లీ సంతాపం తెలిపారు. ఇదిలా ఉండగా.. ఈ ప్రమాదంలో గాయపడిన వారి సంఖ్య ఎక్కువగా ఉండటంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు.

Read more: రైల్వే మంత్రి రాజీనామాకు డిమాండ్.. గతంలో రిజైన్ చేసిన రైల్వే మంత్రులు వీరే

Tags:    

Similar News