IND vs SA 1st Test: సౌతాఫ్రికాతో తొలి టెస్టు.. విరాట్ కోహ్లి అరుదైన ఘనత
దిశ, వెబ్‌డెస్క్: సెంచూరియన్ వేదికగా సౌతాఫ్రికాతో తొలి టెస్టులో టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి అరుదైన ఘనత సాధించాడు. వరుసగా 3 వికెట్లు కోల్పోయిన సమయం క్రీజులోకి వచ్చిన కోహ్లి 64 బంతుల్లో 5 ఫోర్ల సాయంతో 38 పరుగులు చేసి ఔటయ్యాడు. ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ చరిత్రలో అత్యధిక పరుగులు చేసిన భారత ఆటగాడిగా కింగ్ కోహ్లి నిలిచాడు. కోహ్లి ఇప్పటివరకు 57 ఇన్నింగ్స్‌లలో 2101 పరుగులు చేశాడు. అంతకుముందు ఈ రికార్డు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ పేరిట ఉండేది. రోహిత్ 42 ఇన్నింగ్స్‌లలో 2097 పరుగులు చేశాడు.
రోహిత్ తర్వాతి స్ధానంలో వెటరన్ ఆటగాడు ఛతేశ్వర్ పుజారా(1769) ఉన్నాడు. సౌతాఫ్రికాతో టెస్టుల్లో అత్యధిక పరుగులు సాధించిన మూడో భారత ఆటగాడిగా విరాట్ రికార్డులకెక్కాడు. 17 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద విరాట్ ఈ ఘనత సాధించాడు. ఈ క్రమంలో టీమిండియా ప్రస్తుత హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్(1252 పరుగులు)ను కోహ్లి అధిగమించాడు.
Read More..