ప్రస్తుత వరల్డ్ క్రికెట్‌లో అతడే నా ఫేవరెట్ క్రికెటర్: విలియమ్‌సన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

భారత్ వేదికగా జరుగుతున్న వరల్డ్ కప్-2023 లో టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ అద్భుతంగా రాణిస్తున్నాడు. ప్రత్యర్థి ఎవరైనా గ్రౌండ్‌లో పరుగుల వరద పారిస్తున్నాడు.

Update: 2023-11-09 11:45 GMT

దిశ, వెబ్‌డెస్క్: భారత్ వేదికగా జరుగుతున్న వరల్డ్ కప్-2023 లో టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ అద్భుతంగా రాణిస్తున్నాడు. ప్రత్యర్థి ఎవరైనా గ్రౌండ్‌లో పరుగుల వరద పారిస్తున్నాడు. ఈ వరల్డ్ కప్‌లో ఇప్పటి వరకు 8 మ్యాచులు ఆడిన రన్ మెషిన్.. 543 పరుగులతో ఈ సీజన్‌లో అత్యధిక రన్స్ చేసిన ఆటగాళ్ల జాబితాలో రెండవ స్థానంలో ఉన్నాడు. ఇందులో రెండు సెంచరీలు ఉండటం గమనార్హం. ఇటీవల సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో శతక్కొట్టిన కోహ్లీ.. అంతర్జాతీయ వన్డే క్రికెట్ చరిత్రలో అత్యధిక సెంచరీలు చేసిన సచిన్ టెండూల్కర్ రికార్డ్‌ను సమం చేశాడు. సచిన్ టెండూల్కర్ వన్డే క్రికెట్‌లో 49 సెంచరీలు బాది ఇప్పటి వరకు ఈ ఫార్మాట్‌లో అత్యధిక సెంచరీలు కొట్టిన జాబితాలో తొలి స్థానంలో ఉన్నాడు.

సౌతాఫ్రికాతో సెంచరీతో చెలరేగిన కోహ్లీ.. వన్డేల్లో 49 శతకాలు చేసి సచిన్ రికార్డ్‌ను సమం చేశాడు. కాగా, ఈ వరల్డ్ కప్‌లో అంచనాలకు మించి రాణిస్తోన్న టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీపై ప్రశంసల వర్షం కురుస్తోంది. ఈ నేపథ్యంలో చేజింగ్ కింగ్‌పై న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియసన్ పొగడ్తల వర్షం కురిపించాడు. ప్రస్తుతం వరల్డ్ క్రికెట్‌లో నా ఫేవరెట్ క్రికెటర్ విరాట్ కోహ్లీ అని చెప్పారు. వరల్డ్ కప్‌లో అద్భుతంగా రాణిస్తున్నాడని కొనియాడాడు. కాగా, అండర్ 19 వరల్డ్ కప్‌లో కోహ్లీ ఇండియాకు, విలియసన్ న్యూజిలాండ్ జట్లకు కెప్టెన్లు గా వ్యవహరించిన సంగతి తెలిసిందే.


Similar News