టీమిండియాలో గాయాల కలవరం.. కోహ్లీ, రాహుల్‌కు గాయం
ఆస్ట్రేలియాతో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి ముందు టీమిండియాను గాయాలు ఆందోళనకు గురిచేస్తున్నాయి.
దిశ, స్పోర్ట్స్ : ఆస్ట్రేలియాతో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి ముందు టీమిండియాను గాయాలు ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఈ నెల 22 నుంచి పెర్త్ వేదికగా తొలి టెస్టు ప్రారంభంకానుంది.ఇప్పటికే పెర్త్‌కు చేరుకున్న భారత ఆటగాళ్లు ప్రాక్టీస్ మొదలుపెట్టారు. అయితే, స్టార్ ప్లేయర్లు విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్‌లకు గాయమైనట్టు ఆస్ట్రేలియా మీడియాలో వార్తలు వస్తున్నాయి. కోహ్లీకి ఏం గాయం అయ్యిందన్న దానిపై స్పష్టత లేదు. అయితే, అతను గురువారం స్కానింగ్‌కు వెళ్లినట్టు తెలుస్తోంది. మరోవైపు, శుక్రవారం ఇంట్రా స్క్వాడ్ మ్యాచ్‌లో రాహుల్ మోచేతికి గాయమైంది. బౌన్సర్ అతని మోచేతికి బలంగా తాకింది. దీంతో అతను మైదానం వీడాడు. అయితే, రాహుల్ గాయం పెద్దది కాదని, చికిత్స తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. గురువారం నెట్ ప్రాక్టీస్‌లో యువ బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్ మోచేతికి గాయమైంది. తొలి టెస్టుకు ముందు ఇలా భారత ఆటగాళ్లు గాయాల బారిన పడటం జట్టును కలవరపెడుతున్నది.