షకీబ్ అల్ హసన్‌కు విరాట్ కోహ్లీ సర్‌ప్రైజ్ గిఫ్ట్

బంగ్లాదేశ్ ఆల్ రౌండర్ షకీబ్ అల్ హసన్‌(Shakib Al Hasan)కు టీమిండియా దిగ్గజ క్రీడాకారుడు విరాట్ కోహ్లీ(Virat Kohli) సర్‌ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చారు.

Update: 2024-10-01 12:55 GMT

దిశ, వెబ్‌డెస్క్: బంగ్లాదేశ్ ఆల్ రౌండర్ షకీబ్ అల్ హసన్‌(Shakib Al Hasan)కు టీమిండియా దిగ్గజ క్రీడాకారుడు విరాట్ కోహ్లీ(Virat Kohli) సర్‌ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చారు. రెండో టెస్టులో విజయం అనంతరం తన బ్యాటును షకీబ్‌కు బహుమతిగా ఇచ్చారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. అయితే.. కోహ్లీ ఇలా చేయడం కొత్తేం కాదు. ఇది వరకు కూడా యువ క్రికెటర్లను ప్రొత్సహించే విధంగా తన బ్యాటును ఇస్తూ వచ్చారు. విరాట్ బ్యాట్‌ అందుకున్న వారిలో రింకూ సింగ్, ఆకాశ్ దీప్, గుర్బాజ్ తదితరులు ఉన్నారు. మరోవైపు విరాట్ ఇచ్చిన బ్యాట్‌తోనే ఆకాశ్ దీప్ నిన్న బంగ్లాపై రెండు సిక్సర్లు కొట్టి సత్తా చూపించారు. ఇదిలా ఉండగా.. బంగ్లాదేశ్‌తో టీమిండియా రెండు మ్యాచ్‌లు ఆడి రెండింట్లోనూ గెలిచి సిరీస్ కైవసం చేసుకున్నది. ఇవాళ కాన్పూర్‌ వేదికగా జరిగిన రెండో టెస్టులో గెలిచి.. టెస్టు సిరీస్‌ను 2-0తో క్లీన్‌ స్వీప్‌ చేసింది. దీంతో ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ పాయింట్ల పట్టికలో అగ్రస్థానాన్ని సుస్థిరం చేసుకుంది.


Similar News