కల కలగానే మిగిలే.. బెంగాల్ క్రికెటర్ మృతి!

బెంగాల్‌కు చెందిన క్రికెట్ యువ కెరటం ఆసిఫ్ హొస్సేన్ తన కలలు నెరవేరకుండానే మృత్యుఒడిలోకి చేరుకున్నాడు. కేవలం 28 ఏళ్ల వయస్సులోనే ప్రాణాలు కోల్పోయాడు. విషయం తెలియగానే స్నేహితులు, కుటుంబసభ్యులు,

Update: 2024-10-01 14:29 GMT

దిశ, స్పోర్ట్స్ : బెంగాల్‌కు చెందిన క్రికెట్ యువ కెరటం ఆసిఫ్ హొస్సేన్ తన కలలు నెరవేరకుండానే మృత్యుఒడిలోకి చేరుకున్నాడు. కేవలం 28 ఏళ్ల వయస్సులోనే ప్రాణాలు కోల్పోయాడు. విషయం తెలియగానే స్నేహితులు, కుటుంబసభ్యులు, అతని సహచరులు శోకసంద్రంలో మునిగిపోయారు. అతని మరణాన్ని సన్నిహితులు, ఫ్యామిలీ మెంబర్స్ అస్సలు ఊహించుకోలేకపోతున్నారు. అయితే, ఆసిఫ్ మృతికి అనారోగ్య పరిస్థితులు కారణం కాదని, మెట్ల మీద నుంచి కింద పడిపోవడమే ప్రధాన కారణంగా తెలుస్తోంది. ప్రమాదానికి గురవ్వడానికి ముందు ఆసిఫ్ ఆరోగ్యంగానే ఉన్నాడని తన ఫ్యామిలీ మెంబర్స్ చెబుతున్నారు.

ఇంట్లో మెట్ల మీద నుంచి కింద పడగానే అతన్ని వెంటనే స్థానిక ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అంబులెన్స్‌‌లో ఆస్పత్రికి చేరుకోగా మార్గం మధ్యలోనే ఆసిఫ్ మరణించినట్లు వైద్య సిబ్బంది వెల్లడించారు.ఇదిలాఉండగా, ఈడెన్ గార్డెన్స్‌లో జరిగిన బెంగాల్ ప్రో T20 లీగ్‌లో ‘అడమస్ హౌరా వారియర్స్’ జట్టు ‘హార్బర్ డైమండ్స్‌’ను 31 పరుగుల తేడాతో చిత్తు చేసింది. ఆ మ్యాచులో ఆసిఫ్ హొస్సేన్ కేవలం 57 బంతుల్లో అజేయంగా 99 పరుగులు చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఇక ఆసిఫ్ మరణవార్త తెలియగానే అతని ఆత్మకు శాంతి చేకూరాలని బెంగాల్ క్రికెట్ టీం మెంబర్స్ ఒక నిమిషం మౌనం పాటించారు. 

Tags:    

Similar News