19 ఏళ్ల కుర్రాడినైనా విరాట్ ఓడిస్తాడు : కోహ్లీపై హర్భజన్ సింగ్ ప్రశంసలు

విరాట్ కోహ్లీ ఫిట్‌నెస్‌పై హర్భజన్ సింగ్ ప్రశంసలు కురిపించాడు.

Update: 2024-08-12 18:13 GMT

దిశ, స్పోర్ట్స్ : టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే. వారు కేవలం వన్డేలు, టెస్టులు మాత్రమే ఆడనున్నారు. తాజాగా రోహిత్, కోహ్లీ భవిష్యత్తుపై భారత మాజీ క్రికెటర్ హర్భజన్‌సింగ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తగినంత ఫిట్‌గా ఉంటూ జట్టు విజయాల్లో భాగమైతే వాళ్లిద్దరూ ఆడటం కొనసాగించాలని వ్యాఖ్యానించాడు.

ఈ సందర్భంగా కోహ్లీ ఫిట్‌నెస్‌పై ప్రశంసలు కురిపించాడు. ‘రోహిత్ మరో రెండేళ్లు సులభంగా ఆడగలడు. కోహ్లీ ఫిట్‌నెస్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అతను ఐదేళ్లు ఆడటం చూస్తారు. విరాట్‌తో పోటీపడుతున్న 19 ఏళ్ల యువకుడిని ఎవరినైనా అడగండి. కోహ్లీ అతన్ని ఓడిస్తాడు. అతను అంత ఫిట్‌గా ఉంటాడు. రోహిత్, విరాట్‌లు ఇంకా చాలా క్రికెట్ ఆడాల్సి ఉందని నమ్ముతున్నా. కానీ, నిర్ణయం వాళ్లదే.’ అని తెలిపాడు.

కాగా, ఇటీవల శ్రీలంకతో వన్డే సిరీస్‌లో సత్తాచాటిన రోహిత్ 157 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. అందులో రెండు హాఫ్ సెంచరీలు ఉన్నాయి. మరోవైపు, కోహ్లీ తన స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోయాడు. మూడు ఇన్నింగ్స్‌ల్లో 58 పరుగులే చేశాడు. 

Tags:    

Similar News