Virat Kohli : సెంచరీతో చెలరేగిన కింగ్ కోహ్లీ.. ఆ రికార్డు బద్దలు
ఆసియా కప్‌లో భాగంగా పాకిస్తాన్‌తో జరుగుతున్న సూపర్-4 మ్యాచ్‌లో టీమిండియా బ్యాటర్లు అదరగొట్టారు. ఓపెనర్లు రోహిత్ శర్మ, శుభ్ మన్ గిల్ హాఫ్ సెంచరీలతో శుభారంభం చేయగా.. తర్వాత వచ్చిన విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్ సెంచరీలతో దుమ్మురేపారు.
దిశ, వెబ్‌డెస్క్: ఆసియా కప్‌లో భాగంగా పాకిస్తాన్‌తో జరుగుతున్న సూపర్-4 మ్యాచ్‌లో టీమిండియా బ్యాటర్లు అదరగొట్టారు. ఓపెనర్లు రోహిత్ శర్మ, శుభ్ మన్ గిల్ హాఫ్ సెంచరీలతో శుభారంభం చేయగా.. తర్వాత వచ్చిన విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్ సెంచరీలతో దుమ్మురేపారు. చివరి వరకు నిలదొక్కుకొని కోహ్లీ(122), కేఎల్ రాహుల్(111)లతో జట్టుకు భారీ స్కోరును అందించారు. దీంతో పాకిస్తాన్ ఎదుట టీమిండియా 356 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్ధేశించింది. ఇదిలా ఉండగా.. ఈ మ్యాచ్‌లో సెంచరీతో విరాట్ కోహ్లీ అరుదైన రికార్డు నెలకొల్పాడు. విరాట్ 13వేల క్లబ్‌లో చేరాడు. అత్యంత వేగంగా ఈ ఫీట్ సాధించాడు.
13 వేల క్లబ్‌లో చేరడానికి ఆస్ట్రేలియా దిగ్గజం రికీ పాంటింగ్‌కు 341 ఇన్నింగ్స్ ఆడితే, భారత దిగ్గజం సచిన్ టెండుల్కర్ 321 ఇన్నింగ్స్ ఆడారు. ప్రస్తుతం విరాట్ కోహ్లీ అత్యంత వేగంగా కేవలం 278 ఇన్నింగ్స్‌లోనే 13 వేల పరుగుల జాబితాలో చేరాడు. షాహీన్ ఆఫ్రీదీ ఓవర్లో సింగిల్ తీసి కోహ్లీ శతకం పూర్తి చేసుకున్నాడు. దాంతో, వన్డేల్లో 47వ శతకం ఖాతాలో వేసుకున్నాడు. దాంతో 50 ఓవర్ల ఫార్మాట్‌లో అత్యధిక సెంచరీలు బాదిన రెండో క్రికెటర్‌గా విరాట్ రికార్డు నెలకొల్పాడు. అంతేకాదు భారత దిగ్గజం సచిన్ టెండూల్కర్ 49 శతకాల రికార్డుకు చేరువగా వచ్చాడు. రికీ పాంటింగ్, రోహిత్ శర్మ 30 వన్డే శతకాలతో మూడో స్థానంలో కొనసాగుతున్నారు.