వినేష్ ఫొగాట్ అనర్హత పిటిషన్... తీర్పు ఏమైందంటే?

పారిస్ ఒలంపిక్స్ లో భారత రెజ్లర్ వినేష్ ఫొగాట్ పై అనర్హత వేటు పడిన విషయం తెలిసిందే.

Update: 2024-08-09 11:49 GMT

దిశ, వెబ్ డెస్క్ : పారిస్ ఒలంపిక్స్ లో భారత రెజ్లర్ వినేష్ ఫొగాట్ పై అనర్హత వేటు పడిన విషయం తెలిసిందే. 50 కేజీల ఫ్రీస్టైల్ విభాగంలో వినేష్ పోటీ పడగా, ఉండాల్సిన బరువు కంటే 100 గ్రాములు ఎక్కువ బరువు ఉందన్న కారణంతో ఫైనల్స్ లో అనర్హతకు గురైంది. దీనిని సవాల్ చేస్తూ వినేష్ కోర్ట్ ఆఫ్ ఆర్బీట్రేషన్ ఫర్ స్పోర్ట్స్ లో పిటిషన్ దాఖలు చేసింది. ఈ అప్పీలును శుక్రవారం విచారించిన కోర్ట్.. పారిస్ ఒలంపిక్స్ ముగిసేలోగా తమ నిర్ణయం వెల్లడిస్తామని తెలిపింది. అయితే వినేష్ కోర్టుకు రెండు విజ్ఞప్తులు చేసింది. మొదటిది తనను ఫైనల్లో పాల్గొనడానికి అనుమతించాలని, రెండోది తనకు రజత పతక హోదా ఇవ్వాలని కోరింది. కాగా వీటిలో మొదటిదాన్ని కోర్టు కొట్టివేయగా.. రెండోదానిపై త్వరలో తుది తీర్పు వెల్లడించనుంది.


Similar News