వాళ్లే నాకు స్ఫూర్తి : మను బాకర్

తన తల్లి, కోచ్‌ల నుంచి స్ఫూర్తి పొందానని భారత స్టార్ షూటర్ మను బాకర్ తెలిపింది.

Update: 2024-09-23 18:40 GMT

దిశ, స్పోర్ట్స్ : తన తల్లి, కోచ్‌ల నుంచి స్ఫూర్తి పొందానని భారత స్టార్ షూటర్, పారిస్ ఒలింపిక్స్ డబుల్ మెడలిస్ట్ మను బాకర్ తెలిపింది. తాజాగా ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ..‘ఓ బలమైన మహిళ పెంపకంలో పెరిగితే మనపై అంతకంటే పెద్ద ప్రభావం మరోటి ఉండదనుకుంటున్నా. మా అమ్మే నాకు స్ఫూర్తి. మా అమ్మ, నా కోచ్ జస్పాల్ సర్ నుంచి ఆత్మవిశ్వాసం పొందాను. జస్పాల్ సర్ శిక్షణలో చాలా కఠినంగా ఉంటారు. నా జీవితాంతం ఆయనే నాకు సరైన కోచ్. షూటింగ్‌లో మాత్రమే కాదు వ్యక్తిగత జీవితంలో కూడా ఆయనే బాస్. ప్రతి వ్యక్తి జీవితంలో చెడ్డ రోజులు, మంచి రోజులు ఉంటాయి. ప్రతి ఒక్కరికీ ఓ కథ ఉంటుంది. వాళ్ల గురించి తెలుసుకున్నప్పుడు మనం వాటి నుంచి స్ఫూర్తి పొందుతాం. నేను ఉసేన్ బోల్ట్ స్టోరీని చదవమని చెబుతా. అతని స్టోరీ అద్భుతంగా ఉంటుంది. తొలి ఒలింపిక్స్ వైఫల్యాలను దాటి అతను వరల్డ్ చాంపియన్, ఒలింపిక్ చాంపియన్‌గా ఎలా మారాడన్నది నాకు చాలా నచ్చింది.’ అని చెప్పుకొచ్చింది. 

Tags:    

Similar News