ఐవీపీఎల్ టైటిల్ సురేశ్ రైనా జట్టుదే
ఇండియన్ వెటరన్ ప్రీమియర్ లీగ్(ఐవీపీఎల్) ప్రారంభ సీజన్ టైటిల్‌ను వీవీఐపీ ఉత్తరప్రదేశ్ ఎగరేసుకపోయింది.
దిశ, స్పోర్ట్స్ : ఇండియన్ వెటరన్ ప్రీమియర్ లీగ్(ఐవీపీఎల్) ప్రారంభ సీజన్ టైటిల్‌ను వీవీఐపీ ఉత్తరప్రదేశ్ ఎగరేసుకపోయింది. ఉత్కంఠ ఫైనల్‌లో ముంబై చాంపియన్స్‌ను ఓడించి చాంపియన్‌గా నిలిచింది. ఆదివారం గ్రేటర్ నోయిడా వేదికగా జరిగిన ఫైనల్‌లో ముంబై చాంపియన్స్‌పై 6 వికెట్ల తేడాతో ఉత్తరప్రదేశ్ విజయం సాధించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన ముంబై చాంపియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లను కోల్పోయి 214 పరుగులు చేసింది. ఫిల్ మస్టర్డ్(76), పీటర్ ట్రెగో(57) హాఫ్ సెంచరీలతో రాణించారు. అభిషేక్(36) విలువైన పరుగులు జోడించాడు. అనంతరం 215 పరుగుల లక్ష్యాన్ని ఉత్తరప్రదేశ్ చివరి ఓవర్‌లో ఛేదించింది. 19.2 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 217 పరుగులు చేసింది. పవన్ నేగి(105 నాటౌట్) అజేయ శతకంతో చెలరేగాడు. పర్వీందర్ సింగ్(51) హాఫ్ సెంచరీ పూర్తి చేసి అవుటవ్వగా.. పునిత్ బిష్ట్(29 నాటౌట్)తో కలిసి పవన్ నేగి జట్టును విజయతీరాలకు చేర్చాడు.