డబ్ల్యూటీసీ ఫైనల్‌.. ఆకట్టుకుంటున్న ఆసీస్ ప్రత్యేక జెర్సీ!

టీమ్ ఇండియాతో జరిగే వరల్డ్‌ టెస్ట్‌ ఛాంపియన్‌షిప్‌ 2021-23 ఫైనల్లో (జూన్‌ 7-11 వరకు లండన్‌లోని కెన్నింగ్‌స్టన్‌ ఓవల్‌) ఆస్ట్రేలియా ప్రత్యేక జెర్సీతో బరిలోకి దిగనుంది.

Update: 2023-05-23 11:28 GMT

దిశ, వెబ్‌డెస్క్: టీమ్ ఇండియాతో జరిగే వరల్డ్‌ టెస్ట్‌ ఛాంపియన్‌షిప్‌ 2021-23 ఫైనల్లో (జూన్‌ 7-11 వరకు లండన్‌లోని కెన్నింగ్‌స్టన్‌ ఓవల్‌) ఆస్ట్రేలియా ప్రత్యేక జెర్సీతో బరిలోకి దిగనుంది. ఈ మ్యాచ్‌లో ఆసీస్‌ జట్టు ధరించబోయే జెర్సీని ఆసీస్ స్టార్‌ ఓపెనర్‌ ఉస్మాన్‌ ఖ్వాజా రివీల్‌ చేశాడు. ప్రత్యేక జెర్సీతో తీసుకున్న సెల్ఫీని ఖ్వాజా ట్విటర్‌లో షేర్‌ చేశాడు. ఈ జెర్సీ నెటిజన్లను ఆకట్టుకుంటుంది. డార్క్‌ గ్రీన్‌ కలర్‌లో 'V' నెక్‌ బోర్డర్‌తో ఈ జెర్సీ డబ్ల్యూటీసీ లోగోను కలిగి ఉంది. మరోవైపు టీమ్ ఇండియా సైతం డబ్ల్యూటీసీ ఫైనల్‌ కోసం ప్రత్యేక జెర్సీని ధరించనుంది.

అయితే ఆటగాళ్లు ఐపీఎల్‌తో బిజీగా ఉన్న కారణంగా జెర్సీ వివరాలు ఇంకా తెలియరాలేదు. డబ్ల్యూటీసీ ఫైనల్‌ కోసం 20 మంది సభ్యులతో కూడిన భారత బృందం (మొదటి బ్యాచ్‌) ఇవాళ (మే 23) ఉదయం ఇంగ్లండ్‌కు బయల్దేరింది. ఈ బృందంలో కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌, అక్షర్‌ పటేల్‌, శార్దూల్‌ ఠాకూర్‌, మహ్మద్‌ సిరాజ్‌, స్టాండ్‌ బై ప్లేయర్‌ ముకేశ్‌ కుమార్‌, నెట్‌ బౌలర్లు ఆకాశ్‌దీప్‌, పుల్కిత్‌ నారంగ్‌లతో పాటు సహాయ సిబ్బంది ఉన్నారు.

Tags:    

Similar News