Rohit-Hardik controversy : రోహిత్, పాండ్యా వివాదం.. తొలిసారిగా స్పందించిన బుమ్రా.. పాండ్యాపై కీలక వ్యాఖ్యలు

ముంబై ఇండియన్స్ కెప్టెన్‌గా రోహిత్ శర్మను తప్పించి హార్దిక్ పాండ్యాను నియమించడం ఎంత చర్చనీయాంశమైందో తెలిసిందే.

Update: 2024-07-26 14:08 GMT

దిశ, స్పోర్ట్స్ : ఈ ఏడాది ఐపీఎల్‌ సీజన్‌లో ముంబై ఇండియన్స్ కెప్టెన్‌గా రోహిత్ శర్మను తప్పించి హార్దిక్ పాండ్యాను నియమించడం ఎంత చర్చనీయాంశమైందో తెలిసిందే. సొంత అభిమానుల నుంచే హార్దిక్ తీవ్రమైన ట్రోలింగ్‌ను ఎదుర్కొన్నాడు. అంతేకాకుండా, ముంబై జట్టు రెండుగా చీలిందన్న వార్తలు కూడా వచ్చాయి. తాజాగా కెప్టెన్సీ మార్పుపై ముంబై ఇండియన్స్ స్టార్ పేసర్ జస్ప్రిత్ బుమ్రా తొలిసారిగా స్పందించాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో బుమ్రా మాట్లాడుతూ.. పాండ్యాను ఒంటరిగా వదిలి వేయలేమని మద్దతుగా నిలిచాడు.

‘మేము జట్టుగా ఉన్నాం. ఒకరిని ఒంటరిగా విడిచిపెట్టం. మేము ఒకరికొకరు సహాయం చేసుకుంటాం. హార్దిక్‌తో కలిసి నేను చాలా క్రికెట్ ఆడాను. మేమందరం కలిసే ఉన్నాం. పాండ్యాకు అవసరమైనప్పుడు మేము అండగా ఉంటాం. అయితే, విమర్శలను మేము జట్టుగా ఎంకరేజ్ చేయం. మేము ప్రపంచానికి వ్యతిరేకం. కొన్ని మన చేతుల్లో ఉండవు. వరల్డ్ కప్ తర్వాత ఆ పరిస్థితులు కూడా మారిపోయాయి.’ అని బుమ్రా చెప్పుకొచ్చాడు. కాగా, ఈ సీజన్‌లో పాండ్యా నాయకత్వంలో ముంబై పేలవ ప్రదర్శన చేసింది. కేవలం 4 విజయాలు మాత్రమే సాధించి అట్టడుగు స్థానంలో నిలిచింది.

Tags:    

Similar News