నేడు తెలుగు క్రికెట్ లెజెండ్ VVS Laxman పుట్టినరోజు
నేడు తెలుగు క్రికెట్ లెజెండ్ వీ.వీ.ఎస్ లక్ష్మణ్ 49 పుట్టినరోజు జరుపుకుంటున్నారు. 1974 నవంబర్ 1న లక్ష్మణ్ హైదరాబాద్ లో జన్మించాడు.
దిశ, వెబ్‌డెస్క్: నేడు తెలుగు క్రికెట్ లెజెండ్ వీ.వీ.ఎస్ లక్ష్మణ్ 49 పుట్టినరోజు జరుపుకుంటున్నారు. 1974 నవంబర్ 1న లక్ష్మణ్ హైదరాబాద్ లో జన్మించాడు. ఆయన పూర్తి పేరు వంగిపురపు వెంకట సాయి లక్ష్మణ్.. కానీ క్రికెట్ లోకి వచ్చాక ఆయనను సాధారణంగా V. V. S. లక్ష్మణ్ అని పిలుస్తారు. లక్ష్మణ్ దేశవాళీ క్రికెట్‌లో హైదరాబాద్‌కు ప్రాతినిధ్యం వహించాడు. అలాగే భారత క్రికెట్ జట్టులో స్థానం దక్కించుకుని తనదైన ముద్ర వేశారు. ముఖ్యంగా టెస్టుల్లో ద్రావిడ్ తో కలిసి.. వాల్ ఆఫ్ టెస్ట్ క్రికెట్ గా పిలిపించుకున్నాడు.
లక్ష్మణ్ భారత జట్టు తరుఫున 127 టెస్టు మ్యాచ్‌లకు, 86 వన్డే మ్యాచ్‌లకు భారత్ తరఫున ప్రాతినిధ్యం వహించాడు. టెస్టులలో 16 శతకాలు, వన్డేలలో 6 శతకాలు సాధించాడు. అలాగే ఐపీఎల్ లో కూడా 20 మ్యాచుల్లో ఆడాడు. VV S లక్ష్మణ్.. మొత్తం 220 ఇంటర్నేషనల్ మ్యాచుల్లో 11119 పరుగులు చేశాడు. అలాగే ఐపీఎల్‌లో 2021 వరకు సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు మెంటర్ గా కూడా కొనసాగాడు. ప్రస్తుతం లక్ష్మణ్ NCA హెడ్ గా భాద్యతలను కలిగి ఉన్నాడు.