Tim David: విధ్వంసకర వీరుడికి బంఫరాఫర్‌.. ఆస్ట్రేలియా వన్డే టీమ్‌లో చోటు

ఆసీస్ విధ్వంసకర ప్లేయర్ టిమ్‌ డేవిడ్‌కు తొలసారి జాతీయ వన్డే జట్టులో చోటు దక్కింది.

Update: 2023-08-31 10:35 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఆసీస్ విధ్వంసకర ప్లేయర్ టిమ్‌ డేవిడ్‌కు తొలసారి జాతీయ వన్డే జట్టులో చోటు దక్కింది. సౌతాఫ్రికాతో వన్డే జట్టులో టిమ్‌ డేవిడ్‌ పేరును ఆసీస్‌ సెలక్టర్లు చేర్చారు. కాగా తొలుత ప్రోటీస్‌తో వన్డే సిరీస్‌కు ప్రకటించిన జట్టులో డేవిడ్‌కు చోటు దక్కలేదు. డేవిడ్‌కు కేవలం టీ20 జట్టులో మాత్రమే సెలక్టర్లు ఛాన్స్‌ ఇచ్చారు.

అయితే ఇప్పుడు స్టీవ్‌ స్మిత్‌, మాక్స్‌వెల్‌, ‌స్టార్క్‌ వంటి ఆటగాళ్లు సౌతాఫ్రికా పర్యటనకు దూరం కావడంతో డేవిడ్‌కు లక్కీ ఛాన్స్‌ లభించింది. కాగా సౌతాఫ్రికాతో జరిగిన తొలి టీ20లో డేవిడ్‌ అద్భుత ఇన్నింగ్స్‌ ఆడాడు. కేవలం 28 బంతుల్లో 7 ఫోర్లు, 4 సిక్స్‌లతో 64 పరుగులు చేశాడు. అదేవిధంగా లిస్ట్‌-ఏ క్రికెట్‌లో డేవిడ్‌ కేవలం 16 మ్యాచ్‌లు మాత్రమే ఆడాడు.


Similar News