Tilak Varma : వన్డే ప్రపంచ కప్ టీం లోకి తిలక్ వర్మ.. రవిశాస్త్రి మద్దతు
వన్డే ప్రపంచ కప్ 2023 అక్టోబర్ 5 నుంచి ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. అయితే వరల్డ్ కప్ లో ఆడే జట్టును భారత్ ప్రకటించినప్పటికీ కొన్ని మార్పులు అనివార్య అయ్యే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
దిశ, వెబ్‌డెస్క్: వన్డే ప్రపంచ కప్ 2023 అక్టోబర్ 5 నుంచి ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. అయితే వరల్డ్ కప్ లో ఆడే జట్టును భారత్ ప్రకటించినప్పటికీ కొన్ని మార్పులు అనివార్య అయ్యే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ క్రమంలో స్క్వాడ్ కోసం శ్రేయాస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్ స్థానంలో తిలక్ వర్మకు రవిశాస్త్రి మద్దతిచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. వెస్టిండీస్ టూర్‌లో సూర్యకుమార్ యాదవ్ అనుకున్నంత ఫామ్ కొనసాగించలేకపోవడం.. శ్రేయశ్ అయ్యర్.. కోలుకుని ఫామ్ లోకి వచ్చే అవకాశాలు సన్నగిల్లడంతో.. మిడిల్ ఆర్డర్ నెం. 4 కోసం యువ వర్మకు మద్దతు ఇవ్వాల్సిన సమయం ఆసన్నమైందని భారత మాజీ కోచ్ రవిశాస్త్రి అభిప్రాయపడ్డాడు. స్టార్ స్పోర్ట్స్‌లో జరిగిన ఒక ఇంటరాక్షన్‌లో శాస్త్రి ఈ విషయాలు చెప్పుకొచ్చాడు.
ఇదే గనుక నిజమైతె చాలా కాలంగా మిడిల్ ఆర్డర్ పోజిషన్‌లో లెఫ్ట్ హ్యాండర్ కోసం వేచి చూస్తున్న భారత జట్టుకు తిలక్ వర్మ ది బెస్ట్ ఆప్షన్ అవుతారు. అలాగే అతను బౌలింగ్ కూడా చేయగలడు. ఒక వేళ తిలక్ ను వరల్డ్ కప్ జట్టులోకి తీసుకుంటే.. సూర్యకుమార్ యాదవ్ తన స్థానాన్ని కోల్పోయే పరిస్థితి నెలకొంటుంది.