తిలక్ బ్యాక్ టూ బ్యాక్ సెంచరీలు.. బెస్ట్ ఫీల్డర్ మెడల్ కైవసం
సౌతాఫ్రికా గడ్డపై అదరగొట్టిన టీమిండియా టీ20 సిరీస్‌ను 3-1తో కైవసం చేసుకున్న విషయం తెలిసిందే.
దిశ, స్పోర్ట్స్ : సౌతాఫ్రికా గడ్డపై అదరగొట్టిన టీమిండియా టీ20 సిరీస్‌ను 3-1తో కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ సిరీస్‌లో తెలుగు కుర్రాడు తిలక్ వర్మ అంచనాలకు మించి సత్తాచాటాడు. వరుస సెంచరీలతో భారత్ సిరీస్ విజయంలో కీలక పాత్ర పోషించాడు.ఫీల్డర్‌గానూ ఆకట్టుకున్నాడు.కొంతకాలంగా టీమ్ మేనేజ్‌మెంట్ మైదానంలో అద్భుతమైన ఫీల్డింగ్ నైపుణ్యాలు ప్రదర్శించిన ఆటగాడిని సత్కరిస్తున్న విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలోనే సౌతాఫ్రికాతో సిరీస్‌కుగానూ టీమిండియా మేనేజ్‌మెంట్ నుంచి తిలక్ బెస్ట్ ఫీల్డర్ మెడల్ అందుకున్నాడు.అందుకు సంబంధించిన వీడియోను బీసీసీఐ శనివారం సోసల్ మీడియాలో పోస్టు చేసింది. ముందుగా నాలుగో టీ20కి సంబంధించి స్పిన్నర్ రవి బిష్ణోయ్‌కు బెస్ట్ ఫీల్డర్ అవార్డు అందజేశారు. అనంతరం సిరీస్ బెస్ట్ ఫీల్డర్ విన్నర్‌ను కెప్టెన్ సూర్యకుమార్ ప్రకటించాడు. అయితే, ఈ మెడల్ కోసం తిలక్‌తోపాటు సూర్య, సంజూ శాంసన్ పోటీపడ్డారు.
సూర్యకుమార్ శాంసన్ దగ్గరికి వెళ్లడతో అతనే విన్నర్ అని మిగతా ఆటగాళ్లు అనుకున్నారు. శాంసన్‌కు షేక్ హ్యాండ్ ఇస్తూ..‘వెల్ డన్ తిలక్’ అనడంతో అందరూ సర్‌ప్రైజ్ అయ్యారు. దీంతో తోటి ఆటగాళ్లు తిలక్‌ను చప్పట్లతో అభినందించారు. తాత్కాలిక హెడ్ కోచ్ వీవీఎస్ లక్ష్మణ్.. తిలక్‌కు మెడల్ బహుకరించాడు. బెస్ట్ ఫీల్డర్ అవార్డు పొందడం పట్ల తిలక్ తన సంతోషాన్ని పంచుకున్నాడు. దక్షిణాఫ్రికా పర్యటనలో తిలక్ సంచలన ప్రదర్శన చేశాడు. నాలుగు మ్యాచ్‌ల్లో 280 పరుగులు చేసి సిరీస్‌లో టాప్ స్కోరర్‌గా నిలిచాడు.