బార్బడోస్ పిచ్‌పై మట్టి తినడానికి కారణం ఇదే: టిమీండియా కెప్టెన్ ROHIT SHARMA
దక్షిణాఫ్రికాపై 7 పరుగుల తేడాతో టీమిండియా ఘనవిజయం సాధించింది.
దిశ, వెబ్‌డెస్క్: దక్షిణాఫ్రికాపై 7 పరుగుల తేడాతో టీమిండియా ఘనవిజయం సాధించింది. 17 ఏళ్ల సుదీర్ఘ కాలం తర్వాత టీమిండియా పొట్టి కప్ అందుకోవడంతో భారతీయుల సంతోషం అంతా ఇంతా కాదు.. ముఖ్యంగా క్రికెట్ లవర్స్ సంబరాలు అంబరాన్నంటాయి. టీ 20 ప్రపంచకప్ లో మ్యాన్ ఆఫ్ ద మ్యాట్ విరాట్ కోహ్లీ నిలిచారు. టీ 20 ప్రపంచకప్ మ్యాన్ ఆఫ్ టోర్నీగా బుమ్రా నిలిచారు. భారత్-176/7 స్కోర్ చేయగా.. దక్షిణాఫ్రికా 169/8 స్కోర్ చేసింది. కోహ్లీ ఏకంగా 59 బంతుల్లో 76 పరుగులు చేసి టోర్నమెంట్‌ను దద్దరిల్లించారు. అయితే టీ 20 వరల్డ్ కప్ గెలుపొందిన అనంతరం టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ బార్బడోస్ పిచ్ మీద మట్టి తిన్నారు. తాజాగా ఆయన మట్టి తినడానికి గల కారణమేంటో చెప్పుకొచ్చారు. ఆ పిచ్ పైనే టీమిండియా ఫైనల్ గెలిచి ప్రపంచకప్ సాధించామని, దీంతో రోహిత్ శర్మకు ఆ పిచ్ ఎంతో ప్రత్యేకమని వెల్లడించారు. కాగా దాన్ని జీవితాంతం గుర్తుంచుకుంటానని తెలిపారు. ఆ పీచ్ ను రోహిత్‌లో భాగం చేసుకోవాలనే ఉద్దేశ్యంతో అలా మట్టి నోట్లో వేసుకున్నానని పేర్కొన్నారు. ఇక టీమిండియా విజయం భారతీయుల్లో ఇప్పటికీ ఎనలేని సంతోషాన్ని నింపుతుంది.