ఈ సెంచరీయే వారికి సమాధానం: ఉస్మాన్ ఖవాజా
అహ్మదాబాద్‌లో జరుగుతున్న నాలుగో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో అజేయంగా 180 పరుగులు చేసి అక్షర్ పటేల్ బౌలింగ్ లో ఎల్బీగా వెనుదిగిగాడు ఉస్మాన్ ఖవాజా.
దిశ, వెబ్ డెస్క్: అహ్మదాబాద్‌లో జరుగుతున్న నాలుగో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో అజేయంగా 180 పరుగులు చేసి అక్షర్ పటేల్ బౌలింగ్ లో ఎల్బీగా వెనుదిగిగాడు ఉస్మాన్ ఖవాజా. గత ఏడాది పాక్ పర్యటనలో 195 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచిన ఉస్మాన్ ఖవాజా, అహ్మదాబాద్ టెస్టులో డబుల్ సెంచరీ వైపు దూసుకుపోతున్నాడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాను ఇంతకు ముందు ఎప్పుడూ సెంచరీ తర్వాత ఇంతలా నవ్వింది లేదన్నాడు. ఈ సెంచరీ చాలా ప్రత్యేకమన్నాడు.
ఇంతకు ముందు రెండు సార్లు భారత పర్యటనకు 2013, 2017లో కేవలం నన్ను ఎనమిది మ్యాచుల్లో డ్రింక్స్ బాయ్‌గానే వాడుకున్నారని, ఒక్క మ్యాచ్ కూడా ఆడించలేదన్నాడు. నా కెరీర్ ఆరంభంలో నేను స్పిన్ ఆడలేదని అందరూ అనుకున్నారని తెలిపాడు. అందుకే ఇండియాలో టెస్టు మ్యాచులు ఆడే అవకాశం రాలేదన్నాడు. ఐదేళ్ల క్రితం ఆడలేవని పక్కనబెట్టిన చోటే, ఓపెనర్‌గా వచ్చి సెంచరీ బాదడం చాలా గర్వంగా అనిపించిందన్నాడు. ఇప్పుడు నేను స్పిన్ ఆడలేనని విమర్శించిన వారందరికీ నేను సమాధానం చెప్పేశానని తెలిపాడు.
ఇండియాలో సెంచరీ చేస్తానని నేను అనుకోలేదని, అందుకే సెంచరీ అయ్యాక చాలా ఎమోషనల్ అయ్యానని తెలిపాడు. స్పిన్ బౌలింగ్ ఎదుర్కోవడానికి చాలా ప్రాక్టీస్ చేశానని, ఆత్మ విశ్వాసంతో సాధన చేశానన్నాడు. ఈ విషయంలో నాకు ఎవరి సహకారం దక్కలేదని, టీం, కోచింగ్ స్టాఫ్, సెలక్టర్లు ఎవ్వరూ నాకు అండగా నిలవలేదన్నాడు. ఎన్నో కష్టాలను అనుభవించి, నా పొజిషన్‌ని దక్కించుకున్నానని. అందుకే ఊరికే దాన్ని కోల్పోకూడదని గట్టిగా ఫిక్స్ అయ్యాయని తెలిపాడు.
12 ఏళ్ల తర్వాత భారత పర్యటనలో సెంచరీ సాధించిన లెఫ్ట్ హ్యాండ్ ఓపెనర్‌గా రికార్డు క్రియేట్ చేశాడు ఉస్మాన్ ఖవాజా. ఇంతకు ముందు 2010-11 బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో ఆసీస్ లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్ మార్కస్ నార్త్ సెంచరీ చేశాడు. 4 మ్యాచుల్లో 303 పరుగులు చేసిన ఉస్మాన్ ఖవాజా, బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ 2023లో టాప్ స్కోరర్‌గా ఉన్నాడు.