SRH: సన్ రైజర్స్ జట్టు రిటెన్షన్ చేసుకునే ఐదుగురు ప్లేయర్లు వీరే
ఐపీఎల్(IPL) 2025-27 సీజన్లకు గాను మెగా వేలం 2024 డిసెంబర్‌లో జరగనుంది.
దిశ, వెబ్ డెస్క్: ఐపీఎల్(IPL) 2025-27 సీజన్లకు గాను మెగా వేలం 2024 డిసెంబర్ లో జరగనుంది. ఈ క్రమంలో ఐపీఎల్ తీసుకొచ్చిన కొత్త రూల్స్ ప్రకారం ప్రతి జట్టు ఐదుగురు ప్లేయర్లను రిటెన్ష్ చేసుకునేందు వీలు కల్పించింది. కాగా ఈ నెల 31 వరకు వారికి రిటెన్షన్ ప్లేయర్ల లిస్టును ప్రకటించాలని బీసీసీఐ(BCCI) అధికారులు ఆదేశించగా.. రేపటితో వారి గడువు ముగియనుంది. 2024 సీజన్ లో సన్ రైజర్స్ హైదరాబాద్(Sunrisers Hyderabad) జట్టు పెను సంచలనంగా మారడమే కాకుండా ఫైనల్ చేరుకొని రన్నరప్ గా నిలిచింది. గత సీజన్ లో చాలా మంది కీలక ప్లేయర్లు ఉండగా.. వారిలో ఎవరిని రిటెన్షన్ చేసుకోవాలో తెలియక హైదరాబాద్ జట్టు యాజమాన్యం సందిగ్దంలో పడిపోయింది. ఈ క్రమంలో సన్ రైజర్స్ జట్టు రిటెన్షన్ చేకునే ప్లేయర్లను ఆయా స్పోర్ట్స్ న్యూస్ సంస్థలు అంచనా వేస్తున్నాయి.
ఈ క్రమంలోనే ప్రముఖ ఈఎస్పీఎన్ సంస్థ కూడా హైదరాబాద్ జట్టు రిటైన్ చేసుకునే ప్లేయర్ల లిస్టును ప్రకటించింది. ఆ లిస్టు ప్రకారం.. హెన్రిచ్ క్లాసెన్ - 23 కోట్లు, పాట్ కమిన్స్ - 18 కోట్లకు, అభిషేక్ శర్మ - 14 కోట్లకు, ట్రావిస్ హెడ్‌ను 14 కోట్లకు, నితీష్ కుమార్ రెడ్డిని ఆన్ క్యాపుడ్ ప్లేయర్ గా 6 కోట్లకు కొనుగోలు చేయనున్నట్లు తెలిపింది. ఈ నిర్ణయంతో సన్‌రైజర్స్ తమ జట్టులోని కీలక ప్లేయర్లను వేలానికి వదులుకునేందుకు సిద్దమైంది. అలాగే సీనియర్ బౌలర్ భువనేశ్వర్ కుమార్ ను ఆర్టీఎమ్ కింద జట్టులోకి తీసుకునే అవకాశాలు ఉన్నట్లు క్రీడా విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. దీనిపై రేపు సాయంత్రం లోపు క్లారిటీ రానుంది.