భారత్ vs పాకిస్తాన్.. హైవోల్టేజ్ మ్యాచ్‌కు అదిరిపోయే మైదానం

‘ఇండియా క్రికెట్ మ్యాచ్ ఆడితే పాకిస్తాన్‌తోనే ఆడాలి.. బంగ్లాదేశ్‌తో ఆడితే ఏముంటుంది’ అని ఓ సినిమాలో హీరో నితిన్ చెప్పిన డైలాగ్ ఎంత ఫేమస్ అయిందో ప్రత్యేకంగా గుర్తుచేయాల్సిన పనిలేదు.

Update: 2023-05-05 07:52 GMT

దిశ, వెబ్‌డెస్క్: ‘ఇండియా క్రికెట్ మ్యాచ్ ఆడితే పాకిస్తాన్‌తోనే ఆడాలి.. బంగ్లాదేశ్‌తో ఆడితే ఏముంటుంది’ అని ఓ సినిమాలో హీరో నితిన్ చెప్పిన డైలాగ్ ఎంత ఫేమస్ అయిందో ప్రత్యేకంగా గుర్తుచేయాల్సిన పనిలేదు. ఇటీవల టీ20 ప్రపంచ కప్‌లోనూ అంతే ఉత్కంఠంగా భారత్, పాక్ మ్యాచ్ జరిగింది. విరాట్ కోహ్లీ ఒంటిచేత్తో మ్యాచ్‌ను గెలిపించి టీమిండియా పరువు కాపాడాడు. అయితే, ఈ రెండు జట్లు మరోసారి ప్రపంచకప్‌లో తలపడటానికి సిద్ధమయ్యాయి. 2023 వన్డే వరల్డ్ కప్‌ మ్యా్చ్‌లో కీలక మార్పులు చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. ప్రపంచంలోనే అతి పెద్ద క్రికెట్ స్టేడియంగా పేరుగాంచిన గుజరాత్లోని నరేంద్ర మోడీ స్టేడియంలో భారత్, పాకిస్తాన్ మ్యాచ్ను నిర్వహించే యోచనలో బీసీసీఐ ఉన్నట్లు తెలుస్తోంది.

అక్టోబర్, నవంబర్లలో భారత్లో వన్డే వరల్డ్ కప్ జరగనుంది. ఇందులో భాగంగా భారత్ పాక్ హైవోల్టేజ్ మ్యాచ్‌కు అహ్మదాబాదే వేదిక కానుంది. దాయాదిల మ్యాచ్ అంటే భారత్‌తో పాటు.. ప్రపంచంలోని వివిధ ప్రాంతాల నుంచి అభిమానులు వస్తుంటారు. ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ స్టేడియం, లక్ష మంది అభిమానులు మ్యాచ్ చూసే అవకాశం నరేంద్ర మోడీ స్టేడియంలో ఉంది. ఈ నేపథ్యంలో అహ్మదాబాద్ లోని ఈ స్టేడియంలోనే ఇండో పాక్ మ్యాచ్ నిర్వహించాలని బీసీసీఐ నిర్ణయించినట్లు తెలుస్తోంది. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

Tags:    

Similar News