క్రికెట్ లవర్స్‌కు బిగ్ షాక్.. రిటైర్మెంట్ ప్రకటించిన స్టార్ ఆల్‌రౌండర్‌

క్రికెట్ లవర్స్‌కు ఇంగ్లాండ్‌(England) ఆల్‌రౌండర్ మొయిన్ అలీ(Moeen Ali) గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు.

Update: 2024-09-08 05:33 GMT

దిశ, వెబ్‌డెస్క్: క్రికెట్ లవర్స్‌కు ఇంగ్లాండ్‌(England) ఆల్‌రౌండర్ మొయిన్ అలీ(Moeen Ali) గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. తనదైన ఆట తీరుతో జట్టుకు ఎన్నో విజయాలు అందించడంలో కీలక పాత్ర పోషించారు. తాజాగా.. ఆయన క్రికెట్ లవర్స్‌కు షాకిచ్చారు. అంతర్జాతీయ క్రికెట్‌(International Cricket)కు విడ్కోలు ప్రకటించారు. ‘నేను నా దేశం తరపున ఎన్నో ఏళ్లు క్రికెట్(Cricket) ఆడాను. ఇక యువకులకు అవకాశం ఇవ్వాల్సిన సమయం వచ్చింది’ అని ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు.

మొయిన్ అలీ ఇప్పటికే రెండుసార్లు రిటైర్మెంట్ ప్రకటించి తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నారు. ఇకపై అలాంటి ప్రయత్నం చేయబోను అని స్పష్టం చేశారు. ఇక మొయిన్ అలీ ఇంగ్లాండ్ తరపున 68 టెస్టులు, 138 వన్డేలు, 92 టీ20లు, 352 లీగ్‌ మ్యాచ్‌లు ఆడారు. అన్ని ఫార్మాట్లలో కలిపి మొత్తం 6,600కి పైగా పరుగులు చేయడంతోపాటు.. ఇప్పటివరకూ 360+ వికెట్లను పడగొట్టి రికార్డుకెక్కాడు. ప్రస్తుతం ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌ తరఫున ఆడుతున్న మొయిన్ అలీ అందులోనూ ఆడిన 67 మ్యాచుల్లో 1,162 పరుగులు, 35 వికెట్లు తీసి చరిత్రకెక్కాడు.



 



Similar News